అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కాకతీయ

First Published Jul 5, 2017, 6:19 PM IST
Highlights

కాకతీయ యూనివర్శిటీ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందా? యూనివర్శిటీలో పైరవీకారులు రాజ్యమేలుతున్నారా? పరీక్షలు మొదలుకొని డిగ్రీ పట్టాల వరకు అన్నీ అక్రమార్కుల కనుసన్నల్లోనే జరుగున్నాయా? అంటే అవుననే అంటున్నారు విద్యార్థులు.

కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ,  పీహెచ్‌డీ ప్ర‌వేశ ప‌రీక్ష‌ ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విసి ఛాంబర్ ముందు ధర్నా చేశారు.  విద్యార్థులు వీసీ ఛాంబర్‌లోకి దూసుకెళ్ల‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌రీక్షల విష‌యంలో త‌మ‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. కీ పరీక్ష ఫలితాలు తారుమారుగా ఉన్నాయని నిర‌స‌న తెలిపారు.

వీసీ తన‌ పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నేత‌లు డిమాండ్ చేశారు. వర్సిటీలో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో రంగ ప్ర‌వేశం చేసిన పోలీసులు ఆందోళ‌న చేస్తోన్న విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి బయటకు పంపించారు.

click me!