
కరీంనగర్: దేశంలో ఎక్కడాలేని విదంగా తెలంగాణలోని గౌడ కులస్థులకు వైన్ షాప్ (Wine Shop) లలో పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దే అని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. పనిచేసే నాయకునికి సమయం వచ్చినప్పుడు గౌడ కులస్తులు అండగా ఉంటారని... ఇచ్చిన మాటమీద నిలబడతారని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ (TRS) పార్టీకి ఓటు వేయడమే కాదు ఇతరులతో కూడా ఓట్లు వేయించాలని మంత్రి గౌడ కులస్థులకు సూచించారు.
'' కల్లు అమ్మేవాళ్ళను, త్రాగే వాళ్ళను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను పాలించిన ప్రభుత్వాలు అవమాన పరిచాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గౌడ కులస్తుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి'' అని మంత్రి హుజురాబాద్ గౌడన్నలకు సూచించారు.
''పదహారు జబ్బులకు ఔషదంగా కల్లు పని చేస్తుంది. అలాంటి కల్లును ప్రజలకు అందించే గీత కార్మికులకు ముఖ్యమంత్రితో మాట్లాడి మోపెడ్ లు ఇప్పిస్తాం. సర్దార్ పాపన్న వర్ధంతి, జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రితో మాట్లాడి అధికారికంగా జరిగేలా చూస్తాం. అయితే తెలంగాణ కు శ్రీరామ రక్ష గా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనందరం అండగా ఉండాలి''అని మంత్రి సూచించారు.
''కుల సంఘాల కు గౌరవించే పార్టీ టీఆర్ఎస్. హుజూరాబాద్ లో బిజెపి ఒక్క సీటు గెలిచి ఏం సాధిస్తుంది. బిజెపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటోంది. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే మీటర్లు పెడుతానని అంటుంది. అలాంటి బిజెపికి ఓటు వేస్తే మీ ఓటు మురిగి పోయినట్టే'' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
read more ప్రతిపక్షాల భాష సరిగా లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్ధితి: తలసాని వ్యాఖ్యలు
ఇక హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో జరిగిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని 55మంది లబ్ధిదారులకు 55,06,380 రూపాయల విలువ గల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం రాక ముందు బిడ్డ పెళ్లి కోసం భూములు అమ్ముకునేవారని అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక అడ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి గొప్ప పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని అన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు లేవన్నారు.
''కరోనా వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాది ముబరాక్ చెక్కులు ఎక్కడ ఆపలేదు. కాబట్టి కళ్యాణ లక్ష్మి తెచ్చిన కేసీఆర్ వైపు ఉందామా లేక కళ్యాణ లక్ష్మి వద్దన్న ఈటల రాజేందర్ వైపు ఉందమా ఆలోచించండి'' అని గంగుల హుజురాబాద్ ఓటర్లను ప్రశ్నించారు.