కూటమి అధికారంలోకి వస్తే.. రమణకు మంత్రి పదవి

By ramya neerukondaFirst Published Dec 10, 2018, 12:25 PM IST
Highlights

ఈ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఒకవైపు టీఆర్ఎస్.. మరో వైపు మహాకూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఒకవైపు టీఆర్ఎస్.. మరో వైపు మహాకూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

లగడపాటి రాజగోపాల్ చెప్పినట్లు.. మహాకూటమి అధికారంలోకి వస్తే.. టీడీపీ నేత ఎల్. రమణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎల్. రమణతోపాటు.. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా మంత్రి పదవికి దక్కే అవాకాశం ఉందని.. కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.

ఈ ఇద్దరు నేతలు.. జిగిత్యాలకు చెందిన వారు కావడం విశేషం. కూటమి అధికారంలోకి వస్తే.. జగిత్యాలకు డబల్ బంపర్ ఆఫర్ దక్కినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ నియోజకవర్గ టీడీపీ-కాంగ్రెస్ నేతలు కూడా లగడపాటి సర్వేపైనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే.. లగడపాటి స్వయంగా జీవన్ రెడ్డికి ఫోన్ చేసి.. ‘‘ అన్నా నువ్వు గెలుస్తున్నావ్.. మంత్రి కూడా అవుతావు’’ అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన అభిమానుల్లో ఆశలు మరింత పెరిగిపోయాయి.  మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే.. మరి కొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే. 

click me!