ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు.. వంటేరు

By ramya neerukondaFirst Published Dec 10, 2018, 12:05 PM IST
Highlights

ఈ ఫలితాల విడుదల సమయంలో అధికార టీఆర్ఎస్... ఈవీఎంల ట్యాంపరింగ్ కి పాల్పడుతుందనే అనుమానాలు తమకు ఉన్నాయని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. అయితే.. ఈ ఫలితాల విడుదల సమయంలో అధికార టీఆర్ఎస్... ఈవీఎంల ట్యాంపరింగ్ కి పాల్పడుతుందనే అనుమానాలు తమకు ఉన్నాయని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

సోమవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో 100 సీట్లు వస్తాయన్న కేటీఆర్‌... ఇప్పుడు 106 సీట్లు వస్తాయనడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. వీవీ ప్యాట్లలోని స్లిప్పులనూ లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈసీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కైనట్లు అనుమానం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అపోహలు ఈసీ తొలగించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.

click me!