దేవరయంజాల్‌‌ భూముల ఇష్యూ: రెండో రోజూ ఐఎఎస్ కమిటీ విచారణ

Published : May 04, 2021, 01:33 PM IST
దేవరయంజాల్‌‌ భూముల ఇష్యూ: రెండో రోజూ ఐఎఎస్ కమిటీ విచారణ

సారాంశం

: దేవర యంజాల్ లో రెండోరోజు కూడ ఐఎఎస్ అధికారుల కమిటీ  మంగళవారంనాడు విచారణ నిర్వహించింది. దేవాలయానికి సంబందించిన రికార్డులను కూడ ఎండోమెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. 

హైదరాబాద్: దేవర యంజాల్ లో రెండోరోజు కూడ ఐఎఎస్ అధికారుల కమిటీ  మంగళవారంనాడు విచారణ నిర్వహించింది. దేవాలయానికి సంబందించిన రికార్డులను కూడ ఎండోమెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. దేవరయంజాల్  గ్రామంలోని శ్రీసీతారామస్వామి ఆలయానికి  చెందిన 1530 ఎకరాల భూమి ఆక్రమణకు గురయ్యాయి. ఈ విషయమై మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆయన అనుచరులు కూడ  ఈ భూమి ఆక్రమించుకొన్నారనే విషయమై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండో రోజున విచారణ సాగించింది.

also read:అంబానీ కూడ ఇంత సంపాదించలేదు, బీసీ ముసుగేసుకొన్న దొర: ఈటలపై గంగుల ఫైర్

సోమవారంనాడు సాయంత్రం ఐఎఎస్ కమటీ విచారణ చేసింది. రెండో రోజున  ఐఎఎస్ అధికారుల కమిటీ పర్యటించింది. ఈటల రాజేందర్ కు చెందిన గోడౌన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ కమిటీ విచారణ నిర్వహిస్తోంది. ఆలయ రికార్డులతో పాటు ఈ భూముల్లోని నిర్మాణాలను కూడ కమిటీ పర్యటిస్తోంది. దేవాలయ భూములకు సంబంధించి నమోదైన కోర్టు కేసుల ఆధారాలను అధికారుల కమిటీ పరిశీలిస్తోంది. దేువరయంజాల్ భూముల విషయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాాలను కుదిపేస్తోంది. ఈటల రాజేందర్  తో పాటు మరికొందరకి కూడ ఇక్కడ భూములు ఉన్నాయని  కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి  ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?