
కరీంనగర్: అధిష్టానం అవకాశం ఇస్తే హుజూరాబాద్ లో తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో అభివృద్ది జరగలేదని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్దే కన్పిస్తోందన్నారు. ఇప్పట్లో హుజూరాబాద్ లో ఎన్నికలు రావని ఆయన అభిప్రాయపడ్డారు. .హుజూరాబాద్ ను జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ను అభివృద్ది చేస్తానంటే తాను స్వాగతిస్తానని ఆయన ప్రకటించారు.
also read:ఆస్తులను పెంచుకొన్నాడు: ఈటల బీజేపీలో చేరడంపై మావోల ఫైర్
ఈటల రాజేందర్ బీజేపీలో చేరే విషయమై తనతో చర్చించకపోవడమై గతంలో ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెద్దిరెడ్డి చర్చించారు. దీంతో ఆయన కొంత మెత్తబడ్డారని పార్టీ నేతలు చెప్పారు. కొంత కాలం క్రితం పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అప్పటి నుండి హుజూరాబాద్ లో పోటీ చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు