తిమింగలం వాంతి, సులేమాన్ స్టోన్ అంటూ మోసాలు: పోలీసులకి చిక్కిన కేటుగాళ్లు

By Siva KodatiFirst Published Jun 16, 2021, 3:33 PM IST
Highlights

హైదరాబాద్‌లో తిమింగలం వాంతి అంటూ నకిలీ పదార్థాలను అమ్మే ప్రయత్నం చేశారు కొందరు కేటుగాళ్లు. నకిలీ అంబర్ గ్రిస్‌ను తయారు చేసి అమాయకులకు అంటకట్టే ప్రయత్నం చేశారు. ఖైరతాబాద్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకుని నకిలీ అంబర్‌గ్రిస్‌ను తయారు చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో తిమింగలం వాంతి అంటూ నకిలీ పదార్థాలను అమ్మే ప్రయత్నం చేశారు కొందరు కేటుగాళ్లు. నకిలీ అంబర్ గ్రిస్‌ను తయారు చేసి అమాయకులకు అంటకట్టే ప్రయత్నం చేశారు. ఖైరతాబాద్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకుని నకిలీ అంబర్‌గ్రిస్‌ను తయారు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదార్థాన్ని తిమంగలం వాంతి, అంబర్ గ్రిస్ అంటూ మోసం చేస్తున్నారు.

Also Read:డాక్టర్ అవతారమెత్తిన వార్డ్ బాయ్: కోవిడ్‌కు చికిత్స , లక్షల్లో ఫీజు.. రోగుల పరిస్ధితి విషమం

వీటితో పాటు సులేమాన్ స్టోన్‌ను సైతం విక్రయిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. సులేమాన్ స్టోన్ ఇది చేతిలో పెట్టుకుంటే చేయి నరికినా తెగదంటూ ప్రజలను నమ్మిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో దాడి చేసిన సైఫాబాద్ పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను షకీర్ అలీ, షేక్ అలీ, మహ్మద్ అరీఫ్, మహ్మద్ నజీర్, మోహన్‌లాల్ యాదవ్, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ హుసానుద్దీన్‌లుగా గుర్తించారు. వారి నుంచి నకిలీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

click me!