కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌తో తాజా ఎమ్మెల్యే బేరసారాలు

By narsimha lodeFirst Published Jan 2, 2019, 5:13 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు టీఆర్ఎస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు టీఆర్ఎస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి దక్కకపోతే  టీఆర్ఎస్‌లో చేరేందుకు మాజీ మంత్రి రంగం సిద్దం చేసుకొంటున్నట్టు ప్రచారం సాగుతోంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కేవలం 19 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించింది. పీపుల్స్ ఫ్రంట్‌లోని టీడీపీ రెండు స్థానాల్లోనే విజయం సాధించింది.

కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేల్లో  ఇప్పటికే 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఓ మాజీ మంత్రి పేరు కూడ  ప్రముఖంగా విన్పిస్తోంది.

మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన ముఖ్య నేతల్లో కూడ  ఆ మాజీ మంత్రి కూడ ఒకరు. తెలంగాణ అసెంబ్లీలో  కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష హోదా కూడ దక్కకుండా చేయాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. 

దరిమిలా కాంగ్రెస్ పార్టీకి చెందిన  మాజీ మంత్రితో టీఆర్ఎస్ నేతలు చర్చించారనే ప్రచారం కూడ సాగుతోంది. సీఎల్పీ లీడర్ లేదా పీఎసీ ఛైర్మెన్ పదవిని మాజీ మంత్రి కోరుకొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. 

ఈ రెండు పదవులు రాకపోతే మాజీ మంత్రి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు.టీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని  కాంగ్రెస్  పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

మరో వైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఆ కుటుంబానికి  ఓ టిక్కెట్టు కూడ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.ఇదే సమయంలో  ఎంపీ టిక్కెట్టుకు ఈ కుటుంబంతో సమీప బంధుత్వం ఉన్న నేత అడ్డొచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

 

click me!