నూతన సంవత్సరంలో బొల్లారం రాష్ట్రపతి నివాసం కొత్త రికార్డు

Published : Jan 02, 2019, 05:32 PM IST
నూతన సంవత్సరంలో బొల్లారం రాష్ట్రపతి నివాసం కొత్త రికార్డు

సారాంశం

నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నివాసం సందర్శకులతో కలకలలాడింది. జనవరి 1వ తేదీన స్కూళ్లకు, కొన్ని ఆఫీసులకు సెలవులుండటంతో సరదగా గడపాలనుకున్న కుటుంబాలు రాష్ట్రపతి నివాసాన్ని సందర్శించారు. దీంతో ఆ ఒక్క రోజే రికార్డు స్థాయిలో పదివేలకు మందికి పైగా సందర్శకులు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు. సందర్శకుల విషయంలో రాష్ట్రపతి నివాస గృహం చరిత్రలోనే ఇది రికార్డని అధికారులు ప్రకటించారు.

భారత రాష్ట్రపతి శీతాకాల విడిది కేంద్రం బొల్లారం అతిధి గృహంలో ఇటీవలే ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబంతో కలిసి విడిది చేశారు. ఈ సందర్భంగా ఆయన సూచనల మేరకు సివాస ప్రాంగణంలో అటవీ శాఖ భారీ ఎత్తున పచ్చదనం చేపట్టింది. కొత్తగా వేలాది మొక్కలు నాటడంతో పాటు రాక్ గార్డెన్, బటర్ ఫ్లై పార్క్, అరుదైన జాతి మొక్కలతో వనాలను అటవీ శాఖ అభివృద్ది పరిచింది. 

రాష్ట్రపతి పర్యటన ముగిసిన తర్వాత అనవాయితీగా ప్రజలకు బొల్లారం సందర్శన కోసం అధికారులు తెరిచి ఉంచారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరాది జనవరి ఒకటవ తేదీన రాష్ట్రపతి నివాసానికి సందర్శకులు పోటెత్తారు. ఈ  ఒక్కరోజే దాదాపు పదివేలకు మందికి పైగా పర్యాటకులు వచ్చినట్లు...ఇప్పటివరకు సందర్శకుల విషయంలో ఇదే రికార్డు అని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  చిన్న పిల్లల్లో, స్కూలు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెరిగేలా అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయని...సందర్శకులు కూడా తమ పనితనాన్ని అభినందిస్తున్నారని అధికారులు తెలిపారు.

ఈ నెల ఆరవ తేదీ వరక ఎవరైనా రాష్ట్రపతి అతిధి గృహం పర్యాటకుల సందర్శనార్థం తెరిచి వుంటుందని అదికారులు ప్రకటించారు. ఇక్కడి పార్కులను, ప్రకృతి అందాలను, అతిధి గృహ సౌందర్యాన్ని సందర్శకులు తిలకిస్తూ ఆనందంగా  గడపవచ్చని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!