IAF Plane: వాయుసేన విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు 

Published : Mar 02, 2024, 03:58 AM IST
IAF Plane: వాయుసేన విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు 

సారాంశం

IAF Plane: వాయుసేన విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది.  భారత వైమానిక దళానికి చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం సాంకేతిక లోపంతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని రక్షణ ప్రకటన తెలిపింది.

IAF Plane: ఇటీవల విమానాల్లో ఆకస్మికంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రమాదాలకు గురికావడం తెలిసిందే. కొన్ని సార్లు భారీ ఎత్తున  ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. శుక్రవారం హైదరాబాదులో భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి ఎలాగోలా పైలెట్లు ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

వివరాల్లోకెళ్తే..  భారత వైమానిక దళానికి చెందిన సి-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం కిందికి దిగే సమయంలో హైడ్రాలిక్ వింగ్స్ తెరుచుకోలేదు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, IAF బేస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

ఈ క్రమంలో విమానంలోని ఇంధనం అయిపోయేలా పైలట్  గాలిలోనే దాదాపు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు. చివరికి ఎలాగోలా పైలెట్లు ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 12 మంది సురక్షితంగా ఉండడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే