త్వరలోనే యాత్ర చేస్తా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Published : May 23, 2023, 04:21 PM IST
త్వరలోనే  యాత్ర చేస్తా: భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సారాంశం

ఈ ఏడాది  జూన్ లో  ప్రియాంక గాంధీ నల్గొండకు వస్తారని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. 

నల్గొండ: త్వరలోనే  తాను  యాత్ర చేపట్టనున్నట్టుగా  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు.మంగళవారంనాడు ఆయన  నల్గొండలో  మీడియాతో మాట్లాడారు. తనకు  సీఎం పదవి అవసరం లేదన్నారు.  ఆ పదవే తనను వెతుక్కుంటూ  వస్తుందని  ఆయన  ధీమాను వ్యక్తం  చేశారు.  కాంగ్రస్ పార్టీలో  వర్గపోరు లేదన్నారు.  కాంగ్రెస్ పార్టీ నేతలంతా  ఐక్యంగా  పనిచేస్తున్నామన్నారు.  రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమాను వ్యక్తం  చేశారు.  

తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే   యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ను  అమలు చేస్తామని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. జూన్ మాసంలో   ప్రియాంక గాంధీ నల్గొండకు వస్తారని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. తన బర్త్ డే వేడుకలు బల ప్రదర్శనకు వేదిక కాదన్నారు.  

ఈ ఏడాది చివర్లో  జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో  నల్గొండ  నుండి  పోటీ చేయానున్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. గత ఎన్నికల్లో  నల్గొండ  అసెంబ్లీ స్థానం నుండి   పోటీ  చేసి   బీఆర్ఎస్  అభ్యర్ధి  కంచర్ల భూపాల్ రెడ్డి  చేతిలో  ఓటమి పాలయ్యారు.2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి  నుండి పోటీ  చేసి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  విజయం సాధించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్