తప్పుడు కేసు, కోర్టులోనే తేల్చుకుంటాం: డింపుల్ హయతి న్యాయవాది

Published : May 23, 2023, 03:58 PM ISTUpdated : May 23, 2023, 03:59 PM IST
 తప్పుడు  కేసు, కోర్టులోనే తేల్చుకుంటాం: డింపుల్ హయతి  న్యాయవాది

సారాంశం

సినీ నటి  డింపుల్ హయతిపై  తప్పుడు  కేసు పెట్టారని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఈ విషయమై  కోర్టులో తేల్చుకుంటామన్నారు.


హైదరాబాద్: సినీ నటి  డింపుల్ హయతిపై  తప్పుడు కేసు పెట్టారని  ఆమె తరపు న్యాయవాది  చెప్పారు. మంగళవారంనాడు  మధ్యాహ్నం డింపుల్ హయతి  తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు.  ట్రాఫిక్ నియంత్రణకు  రోడ్డుపై  ఉపయోగించే కోన్స్ ను  అపార్ట్ మెంట్  పార్కింగ్  ప్లేస్ లోకి ఎలా వచ్చాయని  ఆయన  ప్రశ్నించారు.   ఇదే విషయాన్ని రెండు నెలలుగా  అడుగుతున్నామన్నారు.

డీసీపీ  స్థాయి వ్యక్తి  కి  అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా అని  ఆయన  ప్రశ్నించారు.   కొన్ని  రోజుల క్రితం డింపుల్ హయతితో  ట్రాఫిక్ డీసీపీ  రాహుల్ హెగ్డే  అసభ్యంగా మాట్లాడారని  ఆయన  ఆరోపించారు. 

రాహుల్ హెగ్డే  తన  డ్రైవర్ తో డింపుల్  పై కేసు పెట్టించారన్నారు.  సినీ నటి  డింపుల్  చేసిన  ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని ఆయన  చెప్పారు. నాలుగు గంటలు   డింపుల్ హయతిని  స్టేషన్ లో కూర్చోబెట్టారన్నారు.  తాము కూడా  లీగల్ లో ఫైట్  చేస్తున్నామని   డింపుల్  హయతి  న్యాయవాది తెలిపారు. వేధించడం కోసమే  డింపుల్ పై కేసు పెట్టారని  న్యాయవాది  చెప్పారు.

also read:రాహుల్ హెగ్డే కారు వద్ద కోన్స్ ను తన్నిన సినీ నటి డింపుల్ హయతి: సీసీటీవీ పుటేజీలో దృశ్యాలు

రెండు రోజుల క్రితం  ట్రాఫిక్ డీసీపీ  రాహుల్ హెగ్డే  కారును  డింపుల్ హయతి  కారు ఢీకొట్టిందని  జూబ్లీహిల్స్  పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది.  హైద్రాబాద్ జర్నలిస్టు కాలనీలోని  ఒకే అపార్ట్ మెంట్ లో  రాహుల్ హెగ్డే,  సినీ నటి  డింపుల్  హయతిలు నివాసం ఉంటున్నారు. ఇదే  అపార్ట్ మెంట్ లో  సీ1. సీ 3  ఫ్లాట్స్ లలో  వీరిద్దరూ  నివాసం ఉంటున్నారు.  ఈ ఇద్దరి మధ్య  కారు పార్కింగ్  విషయమై  గొడవ జరుగుతుంది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు