ఈ నెల 13 నుండి పాదయాత్ర చేస్తా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Published : Feb 09, 2023, 03:07 PM IST
 ఈ నెల  13 నుండి  పాదయాత్ర  చేస్తా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సారాంశం

పాదయాత్ర చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయించుకున్నారు.  నాలుగు జిల్లాల్లో రేవంత్ రెడ్డి  యాత్ర నిర్వహించనున్నారు.  

హైదరాబాద్: ఈ నెల  13వ తేదీ నుండి  యాత్ర నిర్వహించనున్నట్టుగా  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. గురువారం నాడు  కాంగ్రెస్ ఎంపీ    మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి, నల్గొండ,  మహబూబ్ నగర్,  ఖమ్మం జిల్లాల్లో యాత్ర  నిర్వహించనున్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. సమయం తక్కువగా  ఉన్నందున బస్సు లేదా బైక్ యాత్ర  చేయాలా అనే విషయమై  ఆలోచిస్తున్నట్టుగా  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  తెలిపారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  తాము ఏం చేస్తామో  చెబుతామని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. 

  హత్ సే హత్ జోడో  అభియాన్  కార్యక్రమంలో భాగంగా  కాంగ్రెస్ నేతలు  యాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఇందులో  భాగంగానే  కాంగ్రెస్ నేతలు  యాత్రలకు శ్రీకారం చుట్టారు  ఈ  నెల  6వ తేదీన మేడారం నుండి  రేవంత్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు.   ఇతర నేతలు  కూడా  పాదయాత్రలకు సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  కోరారు.  ఇళ్లు, పార్టీ కార్యాలయాలను వదిలి ప్రజల్లోనే ఉండాలని కాంగ్రెస్ నేతలకు  సూచించారు  ఠాక్రే.ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు  నేతలంతా  కలిసికట్టుగా  పనిచేయాలని  పార్టీ నాయకత్వం  కోరింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్