పెరిగిన కేసీఆర్ కుటుంబ ఆస్తులు, కాంగ్రెస్‌కు డిపాజిట్లే రాలేదు: లోక్‌సభలో బండి ఫైర్

By narsimha lode  |  First Published Aug 10, 2023, 5:26 PM IST

మోడీ సర్కార్ పై అవిశ్వాసంపై చర్చ సందర్భంగా  బీఆర్ఎస్ సర్కార్ పై  బండి సంజయ్  తీవ్ర విమర్శలు చేశారు.  
 


న్యూఢిల్లీ:  తెలంగాణలో  రైతులకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్టుగా  నిరూపిస్తే తాను  రాజీనామా చేస్తానని బీజేపీ ఎంపీ బండి సంజయ్  చెప్పారు.నరేంద్ర మోడీ సర్కార్ పై  కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన  అవిశ్వాస తీర్మానంపై  జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ  బండి సంజయ్  గురువారంనాడు  లోక్ సభలో పాల్గొన్నారు.

 తెలంగాణలో  విద్యుత్ కు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వకపోతే  కేసీఆర్ సర్కార్  రాజీనామా చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.ప్రజల అవిశ్వాసం కోల్పోయిన వాళ్లే అవిశ్వాసం పెట్టారని విపక్షాలపై  బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో  బీజేపీది కీలకపాత్ర అని బండి సంజయ్  చెప్పారు.తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటుందని  బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ సీఎం కుటుంబ సభ్యుల ఆస్తులు విపరీతంగా పెరిగాయన్నారు. తెలంగాణ సీఎం కొడుకు ఆస్తులు  400 రెట్లు పెరిగాయని  బండి సంజయ్ ఆరోపించారు.

Latest Videos


కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ  ఒక్కటేనని  బండి సంజయ్ చెప్పారు.  ఈ రెండు పార్టీలు వేర్వేరు కావన్నారు.   కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండు సీట్లే వచ్చాయన్నారు. బీజేపీ 4 స్థానాల నుండి  48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకుందన్నారు.హుజూరాబాద్ , మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదని ఆయన  ఎద్దేవా చేశారు. కరీంనగర్, ఖమ్మం,  నిజామాబాద్, వరంగల్ కార్పోరేషన్ లలో కాంగ్రెస్ కు ఒక్క సీటు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కూడ కాంగ్రెస్ కు సీటు దక్కలేదన్నారు.

మోడీ హయంలో  శక్తివంతమైన భారత్ నిర్మాణానికి  ప్రయత్నం జరుగుతుందని  బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో  1400 మంది  ఆత్మబలిదానం చేసుకున్నారని  బండి  సంజయ్ గుర్తు  చేశారు.  తెలంగాణ ఏర్పాటులో  బీజేపీ కీలకంగా వ్యవహరించిందని బండి సంజయ్ ప్రస్తావించారు.  ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను  ప్రజలకు ఇవ్వడం లేదని కేసీఆర్ సర్కార్ పై  బండి సంజయ్  విమర్శలు చేశారు. 

also read:కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపై ఫైర్: లోక్‌సభ నుండి విపక్షాల వాకౌట్
 
అవినీతి యూపీఏ  ఎలా ఇండియాగా మారిందో  అదే  అవినీతి టీఆర్ఎస్  బీఆర్ఎస్ గా మారిందన్నారు. కేసీఆర్ పేరును  ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని బండి సంజయ్ సంబోధించారు. ఈ సమయంలో  సభలో బీఆర్ఎస్ సభ్యులు  బండి సంజయ్  ప్రసంగానికి అడ్డు తగిలారు. ఈ సమయంలో  బీఆర్ఎస్ ఎంపీలపై  బండి సంజయ్  అసంతృప్తిని వ్యక్తం  చేస్తూ   తన ప్రసంగాన్ని  కోరారు.  కేసీఆర్ సర్కార్  విధానాలతో తెలంగాణలో రైతులు నాశనమౌతున్నారన్నారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను కేసీఆర్ సర్కార్ మోసం చేస్తుందని  ఆయన  విమర్శించారు.

మోడీ మణిపూర్ వెళ్లలేదని బీఆర్ఎస్ విమర్శలు చేయడాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ  తెలంగాణలో  ఇంటర్ విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్  వెళ్లారా అని  అడిగారు.  లిక్కర్  తో  సంబంధం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని  బండి సంజయ్ విమర్శించారు. సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడేది ఆర్ఎస్ఎస్ అన్నారు.  హిందూ సమాజాన్ని సంఘటితం చేసి దేశభక్తి, క్రమశిక్షణ  గల ఏకైక  సంస్థ ఆర్ఎస్ఎస్ అని బండి సంజయ్ చెప్పారు. నమస్తే సదావశ్చలే మాతృభూమి అంటూ ఆర్ఎస్ఎస్ గీతాన్ని  సభలో  ఆయన  ప్రస్తావించారు.ఈ సమయంలో కొందరు ఎంపీలు  బల్లలు చరుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఈ సమయంలో ప్రసంగం ముగించాలని  స్పీకర్  బండి సంజయ్ ను  కోరారు. భరత మాతను తలచి, కొలిచి ఆరాధించే సంస్థ  ఆర్ఎస్ఎస్ అని ఆయన చెప్పారు. 

Speaking in the Lok Sabha. https://t.co/kO447ajd3G

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp)

 

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం లు కలిసి బీజేపీపై అవిశ్వాసం ప్రతిపాదించాయని బండి సంజయ్ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ మూడు పార్టీలు విడిపోయినట్టుగా నటిస్తున్నాయన్నారు. కాంగ్రెస్  కు ఓటేస్తే  బీఆర్ఎస్ కు  ఓటేసినట్టేనన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు  ఓటేసినట్టేనన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన  18 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆయన గుర్తు  చేశారు. బీజేపీకి  మద్దతివ్వాలని  ఆయన తెలంగాణ ప్రజలను  కోరారు.  డబుల్ ఇంజన్ సర్కార్ కు ఏర్పాటయ్యేలా చూడాలని  కోరారు.అయితే  ఒక్క నిమిషం అంటూ  బండి సంజయ్ విపక్షాలపై  విమర్శలు చేస్తూ  తన ప్రసంగాన్ని  ముగించారు. 

click me!