కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో మహిళ మృతి, అపార్ట్‌మెంట్ యాజమాన్యం ముందే మేల్కొని వుంటే

Siva Kodati |  
Published : Aug 10, 2023, 04:27 PM IST
కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో మహిళ మృతి, అపార్ట్‌మెంట్ యాజమాన్యం ముందే మేల్కొని వుంటే

సారాంశం

హైదరాబాద్ కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ పైపు లైన్ రోడ్డులోని ప్రేమ్ సరోవర్ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ షాక్‌తో గంగా భవానీ అనే మహిళ మృతి చెందింది. స్విచ్ బోర్డ్ వద్ద కరెంట్ షాక్ కొడుతోందని కొన్ని రోజుల క్రితమే అపార్ట్‌మెంట్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు.

హైదరాబాద్ కూకట్‌పల్లిలో అపార్ట్‌మెంట్ వాసుల నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ పైపు లైన్ రోడ్డులోని ప్రేమ్ సరోవర్ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ షాక్‌తో గంగా భవానీ అనే మహిళ మృతి చెందింది. గంగాభవానీ భర్త సోమేశ్వర్ ఆ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సెల్లార్‌లోని బోర్ వేయడానికి వెళ్లిన మహిళ స్విచ్ ఆన్ చేసే సమయంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. స్విచ్ బోర్డ్ వద్ద కరెంట్ షాక్ కొడుతోందని కొన్ని రోజుల క్రితమే అపార్ట్‌మెంట్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీని కారణంగానే గంగా భవానీ ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు  పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్