ఎక్కడినుండి నేను పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తోంది: రేణుకా చౌదరి

Published : Sep 14, 2018, 05:58 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
ఎక్కడినుండి  నేను పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తోంది: రేణుకా చౌదరి

సారాంశం

తాను అసెంబ్లీకి పోటీ చేయాలా.. పార్లమెంట్ కు పోటీ చేయాలా అనే విషయాన్ని పార్టీ నాయకత్వం తేల్చనుందని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు. 


న్యూఢిల్లీ: తాను అసెంబ్లీకి పోటీ చేయాలా.. పార్లమెంట్ కు పోటీ చేయాలా అనే విషయాన్ని పార్టీ నాయకత్వం తేల్చనుందని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు. 

దేశంలో ఎక్కడినుండైనా తాను పోటీ చేస్తానని ఆమె చెప్పారు.  అయితే పొత్తుల వల్ల పార్టీకి లాభమేనని ఆమె చెప్పారు.  ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో అవినీతి జరుగుతోందని రేణుకా చౌదరి  ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అవినీతికి కేంద్రంగా మారాయన్నారు.

వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నష్టం వాటిల్లకుండా పొత్తులు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. 


 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే