రిమ్మనగూడ వద్ద రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

Published : Sep 14, 2018, 04:47 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
రిమ్మనగూడ వద్ద రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

సారాంశం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు


గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా వర్గల్ మండలం పాములపర్తికి చెందినవారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద టాటా ఏస్ , లారీ ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మృతులు వర్గల్ మండలంలోని పాములపర్తి వాసులుగా గుర్తించారు.

ఈ ఘటనలో గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 20 మంది టాటా ఏస్ వాహనంలో నాగపూర్ గ్రామంలో చావుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఆటోను వెనుక నుండి ఢీకొట్టింది.దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 
 

PREV
click me!

Recommended Stories

రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch