వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉంది: షర్మిల

By narsimha lodeFirst Published Feb 9, 2021, 12:42 PM IST
Highlights

:తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని వైఎస్ షర్మిల చెప్పారు.

హైదరాబాద్:తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని వైఎస్ షర్మిల చెప్పారు.మంగళవారం నాడు హైద్రాబాద్‌లోని లోటస్ పాండ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు రాజన్న రాజ్యం లేదు,  ఎందుకు లేదన్నది ఇప్పుడు నా ఆలోచన అని ఆమె అన్నారు.అందుకే ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొనేందుకు తాను వైఎస్ఆర్ అభిమానులతో మాట్లాడుతున్నట్టుగా చెప్పారు.

also read:తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: వైఎస్ షర్మిల

తెలంగాణో రాజన్న రాజ్యం తీసుకువస్తానని ఆమె ప్రకటించారు. రాజన్నరాజ్యం ఎందుకు తీసుకురాకూడదని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటిపై తాను అభిమానులతో చర్చిస్తున్నానని ఆమె చెప్పారు. 

నల్గొండతో పాటు ప్రతి జిల్లా నేతలను కలుస్తానని ఆమె తేల్చి చెప్పారు.వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి జిల్లాకు చెందిన  నేతలను కలిసి వాస్తవ పరిస్థితులను తెలుసుకొంటానని చెప్పారు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను తాను తెలుసుకొంటానని చెప్పారు. అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టనని ఆమె తేల్చి చెప్పారు.

షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ఊహగాహానాల నేపథ్యంలో జిల్లాల వారీగా షర్మిల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఇతర జిల్లాల నేతలతో కూడ సమావేశం కానున్నారు. 

click me!