తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: వైఎస్ షర్మిల

By narsimha lodeFirst Published Feb 9, 2021, 12:28 PM IST
Highlights

 త్వరలోనే అన్ని విషయాలను ప్రకటిస్తానని వైఎస్ షర్మిల వైఎస్ఆర్ అభిమానులతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించినట్టుగా తెలుస్తోంది.


హైదరాబాద్: త్వరలోనే అన్ని విషయాలను ప్రకటిస్తానని వైఎస్ షర్మిల వైఎస్ఆర్ అభిమానులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. తెలంగాణలో వైఎస్ లేని లోటు కనిపిస్తోందని, తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టబోనని ఆమె ్న్నారు. నల్లగొండ జిల్లా నాయుకులతోనే కాకుండా అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడుతానని ఆమె చెప్పారు. 

మంగళవారం నాడు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందరితో తాను మాట్లాడుతున్నట్టుగా చెప్పారు.

also read:లోటస్‌పాండ్‌లో షర్మిల: వైఎస్ఆర్ అభిమానులకు అభివాదం

రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన వైఎస్ అభిమానులతో షర్మిల మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు.ఆహ్వానం అందుకొన్న నేతలకు మాత్రమే  లోటస్‌పాండ్ లోకి అనుమతి లభించింది.

ఈ సమావేశం గురించి తెలుసుకొని లోటస్ పాండ్ వద్దకు చేరుకొన్న అభిమానులకు ఆమె అభివాదం చేశారు. షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.షర్మిలపై అభిమానులు కాగితపు పూల వర్షం కురిపించారు.లోటస్ పాండ్ వద్ద బాణసంచా కాల్చి అభిమానులు తమ సంబరాన్ని వ్యక్తం చేశారు.

పార్టీ ఏర్పాటు విషయమై షర్మిల కొందరు కీలక నేతలతో ఇప్పటికే చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఈ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బెంగుళూరు నుండి సోమవారం నాడు సాయంత్రం ఆమె హైద్రాబాద్ కు చేరుకొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ఆమె ప్రకటించారు. 

click me!