ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల్లో: కోమటిరెడ్డి

By narsimha lodeFirst Published Jun 16, 2019, 11:35 AM IST
Highlights

 ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.
 

హైదరాబాద్: ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.

ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  స్పష్టం చేశారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిస్థితులపై రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాలను చెప్పారని వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. బీజేపీ నేత రామ్ మాధవ్ ఎవరో తనకు తెలియదన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు  వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.

తనకు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి చెప్పారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను మంత్రి పదవికి కూడ రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.  పార్టీలో సీనియర్‌ను తానేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు పీసీసీ చీఫ్ పదవిని ఇస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.  

పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీని  అధికారంలోకి తీసుకువస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.తాను చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే  తన ఇంటికి ఆదివారం నాడు వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు వెంకట్ రెడ్డి ఇంటికి చేరుకొన్నారు.

సంబంధిత వార్తలు

బీజేపీ వైపు చూపు: కోమటిరెడ్డికి పీసీసీ నోటీసులు జారీ


 

click me!