శంషాబాద్ లో దారుణం: ప్రియురాలి హత్య, మ్యాన్ హోల్ లో డెడ్ బాడీ

Published : Jun 09, 2023, 10:58 AM ISTUpdated : Jun 09, 2023, 08:20 PM IST
 శంషాబాద్ లో దారుణం: ప్రియురాలి హత్య, మ్యాన్ హోల్ లో డెడ్ బాడీ

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని  శంషాబాద్ లో  ప్రియురాలిని  హత్య చేసి మృతదేహన్ని మ్యాన్ హోల్ లో  దాచి పెట్టాడు. 

హైదరాబాద్: :నగరంలోని శంషాబాద్ లో  దారుణం  చోటు  చేసుకుంది.  ప్రియురాలిని  హత్య  చేశాడు  ప్రియుడు. ప్రియురాలి  మృతదేహన్ని  మ్యాన్ హో ల్  లో దాచి పెట్టాడు. అప్సరను  బస్సు ఎక్కిస్తానని  చెప్పి  కారులో  శంషాబాద్  మందలం  సుల్తాన్ పల్లి  వద్దకు తీసుకెళ్లాడు. అయితే  తనను పెళ్లి చేసుకోవాలని  యువతి  సాయికృష్ణతో గొడవకు దిగింది.  పెళ్లి  చేసుకొనేందుకు సాయికృష్ణ అంగీకరించలేదు. దీంతో  ఇద్దరి మధ్య గొడవ తీవ్రమైంది. కోపంతో  సాయికృష్ణ అప్సర తలపై బండారియతో మోది హత్య చేశాడు. అప్సర మృతదేహన్ని  కారులో సరూర్ నగర్ తహసీల్దార్  కార్యాలయ ఆవరణలో ఉన్న మ్యాన్ హల్ లో దాచిపెట్టాడు.

ఆ తర్వాత  సాయికృష్ణ  అప్సర కన్పించడం లేదని  శంషాబాద్  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.   ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు విచారణ  జరిపితే అసలు విషయం వెలుగు   చూసింది.  సాయికృష్ణ, అప్పరలు  కలిసే ఉన్నారని మొబైల్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు గుర్తించారు. దీంతో  ఈ నెల  3వ తేదీన అప్సర ఏఏ ప్రాంతంలో  తిరిగిందనే విషయమై  పోలీసులు సీసీటీవీ పుటేజీని  పరిశీలించారు.ఈ సీసీటీవీ పుటేజీలో సుల్తాన్ పల్లి వద్ద   కారులో  అప్సర, సాయికృస్ణ తిరిగినట్టుగా దృశ్యాలు  కన్పించాయి.

 ఇవాళ ఉదయం సాయికృష్ణను  పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అప్సర హత్య విషయం వెలుగు చూసింది. సుల్తాన్  పల్లి వద్ద అప్సరను హత్య చేసిన  స్థలాన్ని  పోలీసులకు  సాయికృష్ణ చూపారు. మరో వైపు  సరూర్ నగర్ లో  అప్సర డెడ్ బాడీని  దాచిపెట్టిన మ్యాన్ హోల్ నుండి  వెలికి తీసేందుకు  ప్రయత్నిస్తున్నారు పోలీసులు..  సాయికృష్ణ కు వివాహమైంది. . సాయికృష్ణ  సూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని  ఆలయంలో పూజారిగా  పనిచేస్తున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu