అమ్మ మాట వినకుండా వెళ్లి పాక్‌లో చిక్కుకొన్నా: టెక్కీ ప్రశాంత్

By narsimha lodeFirst Published Jun 1, 2021, 4:35 PM IST
Highlights

ప్రేమ విషయంలో ఎక్కువ ఆలోచించకుండానే తాను  స్విట్జర్లాండ్ వెళ్తూ పాకిస్తాన్ లో చిక్కుకొన్నానని టెక్కీ ప్రశాంత్ చెప్పారు. 
 

 హైదరాబాద్: ప్రేమ విషయంలో ఎక్కువ ఆలోచించకుండానే తాను  స్విట్జర్లాండ్ వెళ్తూ పాకిస్తాన్ లో చిక్కుకొన్నానని టెక్కీ ప్రశాంత్ చెప్పారు. నాలుగేళ్ల తర్వాత హైద్రాబాద్ కు చేరుకొన్న ప్రశాంత్  మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. తాను ఇంత త్వరగా ఇంటికి చేరుతానని అనుకోలేదని టెక్కీ ప్రశాంత్ చెప్పారు.మంగళవారం నాడు హైద్రాబాద్ లో సీపీ సజ్జనార్ తో కలిసి ఆయన మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వానికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని ప్రశాంత్ చెప్పారు. తనతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడ పాకిస్తాన్  జైళ్లలో మగ్గుతున్నారన్నారు.  అయితే తెలంగాణ ప్రభుత్వం కృషి కారణంగానే తాను త్వరగానే  తన ఇంటికి చేరుకొన్నట్టుగా ప్రశాంత్ చెప్పారు.

also read:ప్రేయసి కోసం వెళ్లి నాలుగేళ్లు పాక్ జైల్లో: ఇంటికి చేరిన హైదరాబాద్ టెక్కీ

నెల రోజుల్లోనే  తనను విడుదల చేస్తారని భావించానని చెప్పారు. అదే సమయంలో  తాను వీడియోను రికార్డు చేసి విడుదల చేశానన్నారు. అయితే ఆ వీడియో ద్వారా తాను ఎక్కడ ఉన్నానో తన పేరేంట్స్ కు తెలిసిందని ఆయన చెప్పారు.తాను తన తల్లి చెప్పినా వినకుండా స్విట్జర్లాండ్ బయలుదేరానని ఆయన గుర్తు చేసుకొన్నారు. పేరేంట్స్ మాటలను వినాలని ఆయన కోరారు. తాను  పాకిస్తాన్ చేరుకొన్న సమయంలో తనకు హిందీ సరిగా రాదన్నారు. 

ఇండియన్ల కోసం పాకిస్తాన్  ప్రత్యేక చట్టం తయారు చేసిందన్నారు. ఆర్మీ కోర్టులో  ఆర్మీ అధికారులకు ఇచ్చే భోజనం ఇచ్చేవారన్నారు. ఆర్మీ జైలులో కఠినంగా ఉండేదన్నారు. సాధారణ కోర్టుకు, జైలులో ఇండియా మాదిరిగానే ఉంటుందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ లో ఇండియన్ ఖైదీలందరిని ఒకే బ్లాక్ లో ఉంచుతారని ఆయన చెప్పారు. 


 

click me!