పెద్ద నోట్ల నగదు స్కాం: హైద్రాబాద్‌లో బంగారం వ్యాపారులపై ఈడీ చార్జీషీట్

By narsimha lodeFirst Published Jun 1, 2021, 3:33 PM IST
Highlights

పెద్ద నగదు నోట్ల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగారం వ్యాపారులపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 

హైదరాబాద్: పెద్ద నగదు నోట్ల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగారం వ్యాపారులపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ చార్జీషీట్ లో 111 మంది పేర్లను చేర్చింది ఈడీ.పెద్ద నగదు నోట్ల రద్దు (డీమానిటైజేషన్) సమయంలో  హైద్రాబాద్ కు చెందిన కొందరు బంగారం వ్యాపారులు అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకొన్నారు. 

బంగారం కొనుగోళ్లు జరగకపోయినా కూడ బంగారం కొనుగోళ్లు జరిగినట్టుగా  నకిలీ ఖాతాదారుల పేర్లపై నగదును బదిలీ చేశారని అధికారులు గుర్తించారు.  ఈ విషయమై సోదాలు నిర్వహించి ఈ ఏడాది జనవరి మాసంలో సుమారు 130 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో  ముసద్దిలాల్ తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కూడ ఈడీ కేసులు నమోదు చేసింది. చార్జీషీట్ లో వారి పేర్లను ఈడీ  పేర్కొంది. 111 మంది పేర్లను చార్జీషీట్ లో ఈడీ తెలిపింది. 25 మంది బంగారం వ్యాపారులతో పాటు 16 మంది చార్టెడ్ అకౌంటెంట్ల పేర్లను కూడ ఈడీ చేర్చింది.

click me!