
ఆదివాసీ బిడ్డనైన తన ఎదుగుదలను చూడలేకనే తనపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులను తన సొంత అవసరాలకు వాడుకున్నానని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ లు కావాలనే తన పరువు తీస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. తన మాటలను ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కదులుతున్న ఆటోలో మహిళ గొంతుకోసి దారుణ హత్య.. తానూ కోసుకుని..
ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇళ్లు కట్టుకున్నానని, కుమారుడి పెళ్లి చేశానని సోయం బాపురావు చెబుతున్నట్టుగా ఉన్న వీడియో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోను ఆయన ఖండించారు. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ లు ఇద్దరూ తోడు దొంగలు అని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకోవాలి అంటే జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని ఎంపీ స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి అవకాశం లేదని తెలిపారు.
ఆ పదం ఈ దేశానికి, ముస్లింలకు తీవ్ర నష్టం కలిగించింది.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఎంపీ ల్యాడ్స్ నిధులను తన సొంతానికి వాడుకున్నట్టు రుజువు చేస్తే తాను పదవి నుంచి వైదొలుగుతానని, తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సోయం బాపురావు అన్నారు. తన పరువు తీసేలా వ్యవహరిస్తే ఊరుకోబోనని చెప్పారు. కొంత కాలం కిందట కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని, బీఆర్ఎస్ లో చేరుతున్నానని తప్పుగా ప్రచారం చేశారని పేర్కొన్నారు.
కోటి రూపాయల ప్రైజ్ మనీపై గీతాప్రెస్ సంచలన ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే..
ఈ నాయకుల ఆగడాలు భరించలేకనే కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. వీరిద్దరిపై యాక్షన్ తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ ను తాను కోరానని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంగళవారం ఇంకో సారి ఫిర్యాదు చేస్తానని సోయం బాపురావు తెలిపారు.