
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. కనీస వేతనం , పెన్షన్‌పై 2.73 శాతం డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షనర్లతో పాటు 7.28 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. జూన్ నెల వేతనంతో పాటు పెంచిన డీఏను చెల్లిస్తామని ప్రభుత్వం తన ఉత్వర్వుల్లో తెలిపింది.