వీఆర్ఎస్ కు తొందరలేదు: మాజీ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్

By narsimha lode  |  First Published Jan 12, 2023, 10:20 AM IST

వీఆర్ఎస్ కు తొందర లేదని  మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్  చెప్పారు.  ఏం చేయాలనే దానిపై కుటుంబ సభ్యులతో  చర్చిస్తున్నట్టుగా  సోమేష్ కుమార్ తెలిపారు. 


విజయవాడ:వీఆర్ఎస్ కు తొందరలేదని  మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. డీఓపీటీ ఆదేశాల మేరకు  ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు  చేసేందుకు  గురువారం నాడు   హైద్రాబాద్ నుండి ఆయన  అమరావతికి చేరకున్నారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు.  డీఓపీటీ ఆదేశాలను గౌరవిస్తూ   ఏపీలో రిపోర్టు  చేస్తున్నట్టుగా  సోమేష్ కుమార్ చెప్పారు.ఈ విషయమై తాను  కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్టుగా సోమేష్ కుమార్ చెప్పారు.  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన  చెప్పారు.  ఏపీ ప్రభుత్వం ఎలా చెబితే  అలా చేస్తానన్నారు.  అధికారిగా  ఏ బాధ్యత ఇచ్చినాపనిచేస్తానని సోమేష్ కుమార్ తెలిపారు. చిన్న పోస్టు పెద్ద పోస్టనే తేడా లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో సోమేష్ కుమార్ ఏపీ రాష్ట్రానికి కేటాయించింది  డీఓపీటీ. అయితే తాను తెలంగాణలోనే ఉంటానని  సోమేష్ కుమార్ ఈ అలాట్ మెంట్ ను  సవాల్ చేశారు.  సోమేష్ కుమార్ కు  తెలంగాణ కేడర్ ను  కేటాయిస్తూ  క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను  కేంద్ర ప్రభుత్వం  2017లో  సవాల్ చేసింది.  ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు  జరిగాయి. సోమేష్ కుమార్ కు   తెలంగాణ కేడర్ ను హైకోర్టు రద్దు చేసింది. ఏపీకి వెంటనే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఆర్డర్ ను అమలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని  సోమేష్ కుమార్ తరపు న్యాయవాది కోరినా కూడా  హైకోర్టు అనుమతించలేదు.  

Latest Videos

undefined

also read:ఏపీ సీఎం జగన్‌, సీఎస్ జవహర్ రెడ్డితో సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ భేటీ

రెండు రోజుల క్రితం  సోమేష్ కుమార్  కు తెకలంగాణ కేడర్ ను రద్దు చేస్తూ  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో  తెలంగాణ సీఎస్ పదవి నుండి సోమేష్ కుమార్ తప్పుకున్నారు.  హైకోర్టు  తీర్పు వెల్లడించిన  వెంటనే  ప్రగతి భవన్  లో కేసీఆర్ తో  సీఎస్ సోమేష్ కుమార్  భేటీ అయ్యారు.  హైకోర్టు  తీర్పు తదనంతర పరిణామాలపై  వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సోమేష్ కుమార్  సీఎస్ పదవి నుండి తప్పుకోవడంతో  ఆయన  స్థానంలో  శాంతికుమారిని  తెలంగాణ ప్రభుత్వం  సీఎస్ గా నియమించింది. 
 

 
 

click me!