
సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటి జయసుధ బుధవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆమెను పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం అందించారు. జయసుధను పార్టీలోకి చేర్చుకున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ కొన్ని అంశాలపై స్పష్టీకరణ ఇచ్చారు.
సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని జయసుధ భావిస్తున్నారని, అందుకోసమే ఆమె బీజేపీలోకి వెళ్లారనే వాదనలు వచ్చాయి. అయితే, వాటిని ఆమె కొట్టివేశారు. తాను సికింద్రాబాద్, ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానని ప్రచారం అవుతున్న వాదనలు అవాస్తవాలని అన్నారు. అవి వట్టి వదంతులను కొట్టిపారేశారు.
Also Read: బీజేపీలో చేరిన జయసుధ: పార్టీ సభ్యత్వాన్ని అందించిన తరుణ్ చుగ్
తాను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా జరిగినట్టు వివరించారు. అయితే, ఇప్పుడు ప్రధాని మోడీ పాలనను చూసి కమలం పార్టీలో చేరినట్టు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని తాను ఇందులో చేరినట్టు వివరించారు. తాను క్రైస్తవుల వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తానని అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు బీజేపీలో చేరి క్రైస్తవులకు సేవ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.