రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు: దక్కించుకొన్న ఏపీ ఎమ్మెల్సీ రమేష్, స్నేహితుడు శశాంక్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 19, 2021, 10:24 AM IST
Highlights


బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన లడ్డు వేలంలో రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు లడ్డు విక్రయం జరిగింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అతని పార్ట్‌నగర్  మర్రి శశాంక్ రెడ్డిలు ఈ లడ్డును దక్కించుకొన్నారు. 2019 కంటే రికార్డు స్థాయి ధర పలికింది.


హైదరాబాద్:  బాలాపూర్ గణేష్ లడ్డును గతంలో కంటే రికార్డు స్థాయి ధరకు వేలంలో విక్రయమైంది. ఈ ఏడాది రూ. 18 లక్షల 90 వేలకు బాలపూర్ గణేష్ లడ్డు వేలంలో పాడారు. మర్రి  శశాంక్ రెడ్డి అతని పార్ట్‌నర్ ఏపీ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ  రమేష్ యాదవ్ లు ఈ లడ్డును దక్కించుకొన్నారు.గత ఏడాది కరోనా కారణంగా బాలాపూర్ గణేష్ లడ్డును విక్రయించలేదు. ఈ లడ్డును గత ఏడాదిలో సీఎం కేసీఆర్  కుటుంబసభ్యులకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందించారు.

రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశ్యంతో తాను ఈ వేలం పాటలో పాల్గొని లడ్డును దక్కించుకొన్నట్టుగా రమేష్ యాదవ్ చెప్పారు. ఈ లడ్డును ఏపీ సీఎం జగన్ కు తాను బహుమతిగా అందిస్తానని ఆయన చెప్పారు. తన సోదరుడు శశాంక్ రెడ్డితో కలిపి ఈ లడ్డును దక్కించుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలం పాటలో పాల్గొనేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని మర్రి శశాంక్ రెడ్డి చెప్పారు.  ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకొంటున్నట్టుగా శశాంక్ రెడ్డి తెలిపారు.2019 లో లడ్డు వేలం కంటే ఈ ఏడాది రూ.140 లక్షలు అధికంగా వేలంపాటలో ధర పలికింది. అయితే గతంలో లడ్డును దక్కించుకొన్న వారి కంటే కొత్తవారికి  వేలం పాటలో పాల్గొనేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు.

click me!