Hyderabad: హైదరాబాద్ రోడ్లపై పోకిరీల ఆగడాలు

Published : Aug 27, 2025, 09:29 PM IST
Hyderabad, Telangana

సారాంశం

Hyderabad : హైదరాబాద్ లోని మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో బైకుపై వెళ్తూ పోకిరీలు రెచ్చిపోయారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Hyderabad : హైదరాబాద్ లోని మాదాపూర్‌లో యువతులు స్కూటీపై వెళ్తుండగా, ముగ్గురు పోకిరీలు బైక్‌పై వెనుకనుంచి ఫాలో అవుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఒక్కసారిగా ఆమె వెనుకనుంచి తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.

ఆ సమయంలో కారులో వెళ్తున్న ఓ మహిళ ఈ దృశ్యాలను వీడియో తీశారు. దానిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది.

సోషల్ మీడియాలో యూజర్లు ముగ్గురు పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన సైబరాబాద్ పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

 

 

ఈ ఘటనలో ముగ్గురు యువకులు బైక్‌పై వుండగా, స్కూటీపై ప్రయాణిస్తున్న అమ్మాయిలను ఫాలో అవుతూ వేధించారు. నెమలి ఈకలతో వెనుకనుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాన్ని వెనుక కారులో ప్రయాణిస్తున్న వారు వీడియో తీసి ప్రశ్నించగానే పోకిరీలు వేగంగా పారిపోయారు.

ఈ ఘటన నెటిజన్లలో ఆగ్రహం రేకెత్తించింది. “ఇలాంటి పోకిరీల వల్లే హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోంది” అని వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం రోడ్లపై పోకిరీల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !