ఛీ..ఛీ.. ఈవిడకు ఇదేం బుద్ది.. కేర్ టేకర్ అయ్యుండి, చిన్నారిపై పాడుపని.. 20యేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు...

By AN Telugu  |  First Published Oct 8, 2021, 8:13 AM IST

2017లో గోపి (పేరు మార్చబడింది) అనే తొమ్మిదేళ్ల బాలుడిని ఒక ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్ లభించింది. అదే స్కూల్ లో పిల్లల కేర్ టేకర్ గా పనిచేసే సరోజ (27) ఆ పసివాడి మర్మాంగాలను తాకేది. అతడిని బెదిరింది Sexually Assaulte చేసేది. ఒకరోజు గోపి తండ్రి, పిల్లాడి ఒంటిమీద కాల్చిన గాయాలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.


హైదరాబాద్ : సరోజ(పేరు మార్చబడింది) హైదరాబాద్ లోని ఒక స్కూల్ లో కేర్ టేకర్ గా పనిచేస్తుంది. ఆమె ఓ పసివాడిమీద చేసిన దారుణాలు విన్న కోర్టు న్యాయమూర్తి మహిళలు ఇలా కూడా చేస్తారా? అని అవాక్కయ్యారు. సరోజ చేసిన పనికి కోర్టు ఆమెకు పోక్సో చట్టం కింద ఇరవై యేళ్లు జైలు శిక్ష విధించింది. అసలు కేసేంటి.. ఏం జరిగిందంటే...

2017లో గోపి (పేరు మార్చబడింది) అనే తొమ్మిదేళ్ల బాలుడిని ఒక ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్ లభించింది. అదే స్కూల్ లో పిల్లల కేర్ టేకర్ గా పనిచేసే సరోజ (27) ఆ పసివాడి మర్మాంగాలను తాకేది. అతడిని బెదిరింది Sexually Assaulte చేసేది. ఒకరోజు గోపి తండ్రి, పిల్లాడి ఒంటిమీద కాల్చిన గాయాలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

Latest Videos

undefined

దీంతో ఎలా జరిగిందని చిన్నారి గోపిని అడిగాడు. ఆ పసివాడు చెప్పడానికి తడబడ్డాడు. ఏదో జరిగి ఉంటుందని, చిన్నారి భయపడుతున్నాడని గ్రహించిన తండ్రి.. ప్రేమగా దగ్గరికి తీసుకుని, బుజ్జగించి అడిగాడు. దీంతో గోపీ అసలు విషయం తండ్రికి చెప్పాడు.

ఉద్యోగం పేరుతో వల.. హైదరాబాద్ లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు, 6 బంగ్లాదేశీ యువతుల అరెస్ట్..

schoolలో  teacher తనను పదే పదే గట్టిగా పట్టుకునేదని, ఎవరూ లేని చోటుకు తీసుకువెళ్లి తన private partsను నొక్కేదని, దానివల్ల తనకు ఎంతో నొప్పి కలిగేదని చెప్పాడు. తనకేం జరుగుతుందో అర్థం కాలేదని, వద్దని ఏడిస్తే కొప్పడేదని, అంతేకాదు అందరికీ ఈ విషయం చెప్పేస్తానని తను అనడంతో సిగరెట్ తో ఒంటిమీద కాల్చిందని.. ఎవరికైనా విషయం చెబితే తన ఒంటినిండా ఇలాగే సిగరెట్ తో కాలుస్తానని బెదిరించిందని గోపీ చెప్పుకొచ్చాడు.

గోపీ చెప్పిన విషయాలు విన్న తండ్రి షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని పోలీసులకు సదరు లేడీ టీచర్ మీద ఫిర్యాదు చేశారు. ఆ తరువాత పోలీసులు సరోజను arrest చేశారు. కోర్టు ఆమెకు ఇరవైయేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి, 10వేల రూపాయలు కూడా కట్టాలని తీర్పునిచ్చింది. 

click me!