ఉద్యోగం పేరుతో వల.. హైదరాబాద్ లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు, 6 బంగ్లాదేశీ యువతుల అరెస్ట్..

బంగ్లాదేశ్ భవానీపూర్ కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్, అతని భార్య నహిదా ఖుసుర్దాస్ కోలిబాలు కొన్నేళ్ల క్రితం అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించారు. కొంతకాలం పాటు ముంబైలో గడిపి.. ఇటీవల హైదరాబాద్ కు మకాం మార్చారు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ఏజెంట్ అతియార్ మొండల్, వ్యభిచార నిర్వాహకుడు కాచి ముషారఫ్తో కలిసి prostitution racket నిర్వహిస్తున్నారు.

prostitution racket busted in hyderabad, six bangladeshi women arrested

హైదరాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను హైదారాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపునగర్ రోడ్ లో ఏడుగురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఖుల్నా జిల్లాలోని భవానీపూర్ కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్ కోలిబా, నహిదా ఖుసుర్దాస్ కోలిబా, చాకి ముషారఫ్ సర్దార్ లతో పాటు మరికొందరు యువతులను అరెస్ట్ చేశారు. 

వారినుంచి bangladesh గుర్తింపు కార్డులు, పాస్ పోర్ట్ జిరాక్స్ కాపీలు, నకిలీ ఆధార్ కార్డులు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెడితే.. బంగ్లాదేశ్ భవానీపూర్ కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్, అతని భార్య నహిదా ఖుసుర్దాస్ కోలిబాలు కొన్నేళ్ల క్రితం అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించారు. 

అమానుషం : చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి.. అత్యాచారం..!

కొంతకాలం పాటు ముంబైలో గడిపి.. ఇటీవల హైదరాబాద్ కు మకాం మార్చారు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ఏజెంట్ అతియార్ మొండల్, వ్యభిచార నిర్వాహకుడు కాచి ముషారఫ్తో కలిసి prostitution racket నిర్వహిస్తున్నారు.

బంగ్లాదేశ్ లో పని మనుషులుగా ఉన్న కొందరు యువతులను అతియార్ మొండాల్ ఇండియాలో మంచి పని, జీతం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సనత్ నగర్ కు తీసుకువచ్చాడు. ఇక్కడ gangతో కలిసి బలవంతంగా prostitution చేయిస్తున్నాడు. దీనిమీద సమాచారం అందుకున్న taskforce కమిషనర్ డీసీపీ (ఓఎస్డీ) పీ రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ కే నాగేశ్వర్ రావు, ఎస్ ఐ కే శ్రీకాంత్, బీ పరమేశ్వర్, బీ అశోక్ రెడ్డి, జీ శివానందం నిందితులను పట్టుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios