కాంట్రాక్ట్ మ్యారేజీ: యెమెన్ వాసితో హైద్రాబాద్ మహిళ పెళ్లి, బాధితురాలికి వేధింపులు

By narsimha lodeFirst Published Jan 10, 2021, 12:57 PM IST
Highlights

నగరంలోని పాతబస్తీలో మరో కాంట్రాక్టు మ్యారేజీ వెలుగు చూసింది. బాధితురాలు హైద్రాబాద్ కు రప్పించాలని  బాధితురాలి తండ్రి ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరో కాంట్రాక్టు మ్యారేజీ వెలుగు చూసింది. బాధితురాలు హైద్రాబాద్ కు రప్పించాలని  బాధితురాలి తండ్రి ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన యువతిని యెమెన్ దేశస్తుడితో బ్రోకర్స్ పెళ్లి చేశారు. లక్ష రూపాయాలు ఇచ్చిన యువతిని యెమెన్ దేశానికి తీసుకెళ్లారు.

యెమెన్ లో మతిస్థిమితం లేని సలీం అనే వ్యక్తికి ఇచ్చి విహవాం చేశారు. యువతిని సలీం సహా అతని కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.  ఇండియాకు తిరిగి వచ్చేందుకు బాధితరాలు ప్రయత్నించింది.  సలీం కుటుంబసభ్యులు ఆమెను అడ్డుకొన్నారు.

బాధితురాలి పాస్‌పోర్టును సలీం కుటుంబ సభ్యులు తమ వద్దే ఉంచుకొన్నారు. ఆమెను వేధిస్తున్నారని యువతి కుటుంబం ఆరోపిస్తోంది. 

యెమెన్ దేశస్తుడి కుటుంబం చేతిలో తన కూతురు తీవ్ర ఇబ్బందులు పడుతోందని  తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 

click me!