తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 351 పాజిటివ్, 4,756 యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Jan 10, 2021, 12:13 PM ISTUpdated : Jan 10, 2021, 12:36 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 351 పాజిటివ్, 4,756 యాక్టివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ఈ కేసుల సంఖ్య ఐదువేల దిగువకు చేరింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 37,451మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 351మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,89,784కు చేరితే టెస్టుల సంఖ్య 72,53,463కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 415 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,83,463కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4,756 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,584గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1565కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.81శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట 2, జోగులాంబ గద్వాల 2, కామారెడ్డి 5, ఆదిలాబాద్ 5, భూపాలపల్లి 6, జనగామ 5, జగిత్యాల 8, అసిఫాబాద్ 6, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 7, మెదక్ 5, నాగర్ కర్నూల్ 4,  నిర్మల్ 7, నిజామాబాద్ 9,  సిరిసిల్ల 7, వికారాబాద్ 9, వరంగల్ రూరల్ 6,  ములుగు 5, పెద్దపల్లి 10, సిద్దిపేట 9, సూర్యాపేట 7, భువనగిరి 9, మంచిర్యాల 9, నల్గొండ 10, వనపర్తి 3 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా  65కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 28, రంగారెడ్డి 30, కొత్తగూడెం 9, కరీంనగర్ 16, ఖమ్మం 11,  సంగారెడ్డి 11, వరంగల్ అర్బన్  18 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 


 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu