2022 తర్వాత కొత్త హైదరాబాద్ ను చూస్తాం

First Published Jun 1, 2018, 4:13 PM IST
Highlights

కసరత్తు షురూ చేసిన జిహెచ్ఎంసి

అవును 2022 తర్వాత హైదరాబాద్ ఒక విషయంలో కంప్లీట్ గా మారిపోతుందట. అందుకోసం జిహెచ్ఎంసి కసరత్తు చేస్తున్నది. ఆ వివరాలు చదవండి.

2022 సంవ‌త్స‌రం లోగా  హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప్లాస్టిక్ ర‌హిత న‌గ‌రంగా చేసేందుకు జిహెచ్ఎంసి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ తో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా న‌క్లెస్ రోడ్‌లోని పిపుల్స్ ప్లాజాలో దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ఐక్య‌రాజ్య స‌మితి ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క్ర‌మం ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఎరిక్ సోల్హెమ్  స‌మ‌క్షంలో ప్ర‌క‌టించింది.

2022లోగా ప్లాస్టిక్ ర‌హిత న‌గ‌రంగా హైద‌రాబాద్ మారనుంది. న‌గ‌రంలో ప్లాస్టిక్ తో పాటు ఇత‌ర వ్య‌ర్థ‌ప‌దార్థాల‌ను సేక‌రించేందుకు ప్ర‌త్యేకంగా 100 టిప్ప‌ర్ల‌ను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. కాల‌నీలు, బ‌స్తీల్లో ఉన్న వ్య‌ర్థ‌ప‌దార్థాల‌ను సేక‌రించేందుకు బ్లాక్ బ్యాగ్ క్యాంపెన్‌ను ప్రారంభించింది జిహెచ్ఎంసి. ప‌ర్యావ‌ర‌ణ‌ ప‌రీర‌క్ష‌ణ‌లో భాగంగా ఇ.ఇ.ఎస్‌.ఎల్ అందించిన 20 ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను కూడా ఎరిక్ సోల్హెమ్ ప్రారంభి0చారు.

tags
click me!