(వీడియో) హైదరాబాద్ పోలీసులు ఇలా లంచం తీసుకుంటారన్నమాట

Published : Mar 23, 2017, 09:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
(వీడియో) హైదరాబాద్ పోలీసులు ఇలా లంచం తీసుకుంటారన్నమాట

సారాంశం

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లంచావతారం

హైదరాబాద్ గతుకుల రోడ్లమీద రయ్ మని దూసుకెళుతుంటే డివైడర్ అడ్డొచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు వస్తూనే ఉంటారు. వారికి ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చేవరకు మన బైక్ ను సూక్ష్మ పరిశీలన చేసి సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు.

 

డ్రైవింగ్ లైసెన్స్ తో సహా అన్ని సర్టిఫికేట్లు మనదగ్గర ఉన్నా సరే ఏదో ఒక పాయింట్ తో వాళ్ల జేబులు నింపుకోకుండా మాత్రం వదలరు.

పోలీసు బాసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తమదైన రీతిలో వాహనదారుల నుంచి అమ్యామ్యాలు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇదిగో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎలా లంచం తీసుకుంటున్నాడో.

 

ఎవరో నెటిజన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాగోతాన్ని వీడియో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ ఫేస్ బుక్ పేజీలో పెట్టాడు. హిమాయతనగర్ లో ఈ సంఘటన జరిగిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో విషయం పోలీసులు బాసులకు తెలియడంతో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం