రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ప్రవేశం లేదు : అడ్డుకున్న సిబ్బంది

First Published Mar 23, 2017, 9:28 AM IST
Highlights

రేవంత్ కు  మద్దతు ఇచ్చిన బిజెపి ఎంఎల్ ఎ కిషన్ రెడ్డి 

 

 

స్పీకర్ మధుసూదనాచారిని కలిసేందుకు వెళ్లిన టిడిపి ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డి ని  పోలీసులు అడ్డుకున్నారు.

 

అసెంబ్లీ లాబీలోకి వెళ్ళరాదని వారు  రేవంత్ కు స్పష్టం చేశారు. 

 

రేవంత్ రెడ్డిని గత వారంలో ఈ సెషన్ కంతా సభనుంచి బహిష్కరించారు.

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నపుడు రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశాడని ఆయనమీద ఆరోపణ.

 

అయితే, ఈ రోజు స్పీకర్ ను కలిసేందుకు  రేవంత్ అసెంబ్లీ లాబీల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారుే.

 

పోతే, రే వంత్ రెడ్డికి  బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు.

ఇష్టా రాజ్యాంగా ఒక ఎమ్మెల్యే పట్ల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. .రేవంత్ నెరస్థుడా అని నిలదిశిన కిషన్ రెడ్డి.

 

అయితే, తాము చీఫ్ మార్షల్ ఆదేశాల మేరకే రేవంత్ ను  అడ్డుకుంటున్నామని  సిబ్బంది శాసన సభ్యులకు తెలిపారు.

సెక్రటరీ  వచ్చేవరకు ఇక్కడే నిలుస్తానన్న రేవంత్  అన్నారు.

.

‘నేను కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళడం లేదు.. అసెంబ్లీలోకి వెల్క వద్దంటే ఎలా..వెళ్లడం 

ఎమ్మెల్యేగా నా హక్కు...అసెంబ్లీ ప్రాంగణం కేసీఆర్ జాగీరా..’ అని విమర్శించారు.
 

click me!