హైద్రాబాద్‌లో పుట్‌పాత్‌ల ఆక్రమణ: 553 మందిపై క్రిమినల్ కేసులు

By narsimha lode  |  First Published Nov 20, 2022, 1:54 PM IST

హైదరాబాద్  నగరంలో  ట్రాఫిక్  ఇబ్బందులు  లేకుండా  పోలీసులు చర్యలు  తీసుకుంటున్నారు. పుట్  పాత్  లు ఆక్రమించుకున్నవారిపై  చర్యలు తీసుకొంటామని పోలీసులు  తేల్చి  చెప్పారు.  ఇప్పటికే  553  మందిపై  క్రిమినల్  కేసులు  పెట్టారు.


హైదరాబాద్: నగరంలో  ట్రాఫిక్  ఇబ్బందులు  తలెత్తకుండా  పోలీసులు  చర్యలు  తీసుకుంటున్నారు. ట్రాఫిక్  నిబంధనలను  కఠినంగా  అమలు చేయనున్నారు. దీనికి  తోడుగా  పుట్ పాత్  లను  ఆక్రమించినవారిపై  కూడా పోలీసులు  కేసులు నమోదు చేస్తున్నారు. పాదచారులు  నడిచేందుకు  వీలుగా  ఏర్పాటు  చేసిన పుట్  పాత్ లను  వ్యాపారస్తులు  ఆక్రమించుకోవడంపై  పోలీసులు  ఇప్పటికే  నోటీసులు  జారీ చేశారు. పుత్  పాత్  లను  పాదచారులు   నడిచేందుకు మాత్రమే  ఉపయోగించేలా  పోలీసులు  జాగ్రత్తలు  తీసుకోనున్నారు. 

జీహెచ్ఎంసీ పరిధిలోని సుమారు  430  కి.మీ. పరిధిలో  పుట్  పాత్ లున్నాయి.  అయితే  పుట్ పాత్ లు  ఆక్రమణకు  గురయ్యాయి.  పుట్ పాత్ లు లేని  కారణంగా  పాదచారులు  రోడ్డుపైనే  నడుస్తున్నారు. పాదచారులు  రోడ్లపై  నడవడంతో  ట్రాఫిక్ కు ఇబ్బందులు  ఏర్పడుతున్నాయి. పుట్  పాత్ లపైనే   నిర్మాణాలున్నాయి.  నగరంలో పుట్  పాత్ లపై  2500  బస్టాపులు  ఏర్పాటు  చేశారు.  అన్నపూర్ణ  క్యాంటీన్లు,  వాటర్ ఏటీఎంలు,  టాయిలెట్ల వంటివి కూడ  కొన్ని చోట్ల  పుట్ పాత్ లపైనే నిర్మించారు. ఇక  నగరంలోని  అన్ని  ప్రాంతాల్లో  పుట్  పాత్ లపైనే  వ్యాపారాలు  సాగిస్తున్న  పరిస్థితులు  నెలకొన్నాయి. చిరు వ్యాపారులతో పాటు  పెద్ద  వ్యాపారులు  కూడా  పుట్ పాత్ లను  ఆక్రమించుకున్న  పరిస్థితులు ఉన్నాయని  పోలీసులు  గుర్తించారు. పుట్  పాత్ లను  ఆక్రమించుకున్నారని  11  వేల మంది  వ్యాపారస్తులకు  పోలీసులు నోటీసులు  జారీ చేశారు. పుట్  పాత్  లు  ఆక్రమించిన  553 మందిపై  పోలీసులు క్రిమినల్ కేసులు  నమోదు  చేశారు.  జీహెచ్ఎంసీ  సిబ్బంది సహాయంతో  పుట్  పాత్ లను  ఖాళీ  చేయించాలని  పోలీసులు  భావిస్తున్నారు. 

Latest Videos

ఈ  నెల  28వ  తేదీ నుండి  ట్రాఫిక్  నిబంధనలను  మరింత  కఠినంగా  అమలు  చేయాలని పోలీస్ శాఖ  భావిస్తుంది.  రాంగ్  రూట్  డ్రైవింగ్ కు రూ. 1700, ట్రిపుల్  రైడింగ్ కు  రూ. 1200  జరిమానాను  విధించనున్నారు.  అంతేకాదు  ఫ్రీలెఫ్ట్ ను  బ్లాక్  చేయడంపై  కకూడా  ఫైన్  విధించనున్నారు.  అంతేకాదు ట్రాఫిక్  సిగ్నల్  వద్ద లైన్  దాటితే కూడా  జరిమానాను  విధించనున్నారు.ఈ  ఏడాది  అక్టోబర్ మాసంలో  హైద్రాబాద్  మాసంలో  రోప్  విధానాన్ని  పోలీసులు  ప్రవేశపెట్టారు.  ఈ  విధానంలో  భాగంగా  పుట్ పాత్ ల ఆక్రమణపై  పోలీసులు  డ్రైవ్  నిర్వహిస్తున్నారు. 

click me!