ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత?.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ..

By Sumanth KanukulaFirst Published Nov 20, 2022, 12:41 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఢిల్లీ వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఢిల్లీ పర్యటనకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఢిల్లీ వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఢిల్లీ పర్యటనకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమెతో పాటు లీగల్ టీమ్ కూడా వెళ్లిందని.. హైకోర్టు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారని సమాచారం. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కవిత మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. 

మరోవైపు ఆమెకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆమెకు ఈడీ నోటీసులు అందాయని కూడా పలుమార్లు ప్రచారం జరిగింది. అయితే తనకు ఎలాంటి ఈడీ నోటీసులు అందలేదని.. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. కానీ కవితకు ఈడీ  నోటీసులు అందాయనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. 

ఈ క్రమంలోనే కవిత ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఢిల్లీకి వెళ్లారా?.. అసలు ఏం పని మీద ఆమె ఢిల్లీకి వెళ్లారు..? అనే విషయాలపైన క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా కవిత కొన్ని జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడనున్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. 

ఇదిలా ఉంటే.. ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ.. తన కుతూరు కవితను వారి పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే కేసీఆర్ చెప్పిన మాటలు వాస్తమేనని కవిత కూడా చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండ్ మాదిరి ప్రతిపాదనతో బీజేపీ తన వద్దకు వచ్చిందని ఆరోపించారు. ఈ ఆఫర్‌ను తాను సున్నితంగా తిరస్కరించినట్లు కవిత తెలిపారు. బీజేపీ మిత్రులు, బీజేపీ స్నేహపూర్వక సంస్థలు ఈ మేరకు తనకు పలు ప్రతిపాదనలు పంపాయని చెప్పారు. 

click me!