నో పార్కింగ్‌లో హైదరాబాద్ సీపీ కారు... జరిమానా వేయించిన జనం

By sivanagaprasad kodatiFirst Published Nov 16, 2018, 11:25 AM IST
Highlights

నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెడితే అది ట్రాఫిక్ పోలీసుల కంటపడితే ఏమన్నా ఉందా.. స్పాట్ ఛలానాలతో జేబులకు చిల్లు పెడతారు.. లేదంటే వెహికల్ లిఫ్టింగ్ వ్యాన్‌లో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్తారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పే ట్రాఫిక్ పోలీస్ బాసే.. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. హైదరాబాద్‌లో అదే జరిగింది

నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెడితే అది ట్రాఫిక్ పోలీసుల కంటపడితే ఏమన్నా ఉందా.. స్పాట్ ఛలానాలతో జేబులకు చిల్లు పెడతారు.. లేదంటే వెహికల్ లిఫ్టింగ్ వ్యాన్‌లో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్తారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పే ట్రాఫిక్ పోలీస్ బాసే.. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. హైదరాబాద్‌లో అదే జరిగింది.

నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ పరిశీలన కోసం వెళ్లారు. ఆయన కారు డ్రైవర్ మహంకాళి పోలీస్ స్టేషన్ కింద కారును ఆపాడు.

కమిషనర్ కారు దిగి లోపలికి వెళ్లారు... అయితే డ్రైవర్ మాత్రం నో పార్కింగ్ బోర్డు స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోకుండా అక్కడే కారును పార్క్ చేశాడు. అటుగా వెళ్తున్న జనం దీనిని గమనించి... వారు ఫోటోలను తీసి ట్విట్టర్‌లో పెట్టారు..

‘‘ నో పార్కింగ్  ఏరియాలో సాక్షాత్తూ అదనపు సీపీ (ట్రాఫిక్ ) అనిల్ కుమార్ కారును పార్కింగ్ చేశారని.. రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకుని.. ఆ తర్వాత అమలు చేయాలంటూ ట్రాఫిక్ ఉన్నతాధికారులకు సూచించారు..

సాధారణ జనాన్ని తరచూ ఇబ్బందులకు గురిచేసే ట్రాఫిక్ పోలీసులు.. మరీ నో పార్కింగ్‌లో వాహనాన్ని పార్క్ చేసిన సీపీ కారుకి చలానా విధిస్తారా..? లేదా..? అని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు స్పందించారు. గంట వ్యవధిలోనే  అనిల్ కుమార్ కారుకు రూ.235 ఛలానా విధిస్తున్నట్లుగా ప్రకటించారు. 
 

click me!
Last Updated Nov 16, 2018, 11:25 AM IST
click me!