రంగంలోకి కేటీఆర్.. వెనక్కి తగ్గిన విజయారెడ్డి

Published : Nov 16, 2018, 11:05 AM IST
రంగంలోకి కేటీఆర్.. వెనక్కి తగ్గిన విజయారెడ్డి

సారాంశం

దివంగత సీఎల్పీ మాజీనేత పి జనార్దన్‌రెడ్డి కూతురు, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ టికెట్టును ఆశించిన సంగతి తెలిసిందే.

ఖైరతాబాద్ టికెట్ విషయంలో టీఆర్ఎస్ పార్టీలో తలెత్తిన అసమ్మతి జ్వాలలను ఆర్పేపనిలో పడ్డారు ఆ పార్టీ నేత కేటీఆర్. దివంగత సీఎల్పీ మాజీనేత పి జనార్దన్‌రెడ్డి కూతురు, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ టికెట్టును ఆశించారు. అయితే.. మంత్రి కేటీఆర్‌తో చర్చల అనంతరం వెనక్కు తగ్గారు. 

ఈ మధ్యే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు టికెట్టు ఖరారు చేయడంతో ఆమె రెబల్‌గా బరిలో ఉంటారని అందరూ భావించారు. రెబల్‌గా బరిలో దిగే విషయమై తమ అనుయాయులు, మద్దతుదారులతో చర్చించిన ఆమె మంత్రి కేటీఆర్‌ జోక్యంతో విరమించుకున్నారు. ఆ వెంటనే మాజీ మంత్రి దానం నాగేందర్‌ విజయారెడ్డి నివాసానికి వెళ్లి తనకు మద్దతు ప్రకటించాలని కోరడంతో ఆమె అంగీకరించారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!