ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ దే... ఏరిక్ సోలీహిమ్ ట్వీట్ కు కేటీఆర్ రిప్లై

By Rajesh KFirst Published Jan 21, 2022, 3:46 PM IST
Highlights

ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ హైదరాబాదీల‌కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మెట్రో న‌గ‌రాల్లో అడ‌వుల‌ను పెంచ‌డంలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడం అభినంద‌నీయ‌మ‌ని ఏరిక్ సోలీహిమ్ తెలిపారు. 
 

ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ హైదరాబాదీల‌కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మెట్రో న‌గ‌రాల్లో అడ‌వుల‌ను పెంచ‌డంలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడం గొప్ప విషయమని అభినందించారు ఏరిక్ సోలీహిమ్. 

2011 -2021 మధ్య కాలంలో జీహెచ్ ఎంసీ పరిధిలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగిందని, వెల్ డన్ తెలంగాణ అని ఏరిక్ సోలీహిమ్ ప్రశంసించారు. ఆయన ట్వీట్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో రీట్వీట్ చేశారు.

హ‌రిత‌హారం క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్‌దే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అడ‌వుల పరిర‌క్ష‌ణ కోసం గ్రీన్ బ‌డ్జెట్ రూపంలో.. హ‌రిత‌హారం కోసం గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్ర‌త్యేక బ‌డ్జెట్ కేటాయించింద‌నీ, అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ కోసం సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం. ఈ కార్య‌క్ర‌మం..  రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకం ద్వారా  రాష్ట్రంలో ఏకంగా 63,200 హెక్టార్లలో అడ‌వుల విస్తీర్ణం కావడానికి దోహ‌ద‌ప‌డింది. ప్ర‌స్తుతం అటవీ విస్తీర్ణంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21.47 శాతం అడవులు ఉన్నాయి. 

మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం అభివృద్ధిలో హైదరాబాద్‌ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో నగరంలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. గత రెండేండ్లుగా అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరగగా..  తెలంగాణలోనే 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదు అయిన‌ట్టు  ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా- 2021 రిపోర్టులో తెలిపింది. 

click me!