కరోనా నిర్ధారణకు సాఫ్ట్ వేర్ ను తయారుచేసిన మన హైద్రాబాదీ!

By Sree sFirst Published May 18, 2020, 8:57 AM IST
Highlights

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ, టెస్టింగ్ కిట్ల కొరత కలచివేస్తున్న నేపథ్యంలో...; ఈ కరోనా వైరస్ ని గుర్థించడానికి అసలు ఏ టెస్టులు అవసరం లేకుండా గుర్తించేందుకు ఒక సాఫ్ట్ వేర్ రూపొందించాడు మన హైద్రాబాదీ!

కరోనా వైరస్ మహమ్మారిని గుర్తించడానికి టెస్టు కిట్ల కోసం మనం విదేశాలపై ఆధారపడుతున్నాము. దేశీయ కిట్లు ఉన్నా... వాటిని తాయారు చేయడానికి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కెమికల్స్ నే వాడవలిసి వస్తుంది. 

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ, టెస్టింగ్ కిట్ల కొరత కలచివేస్తున్న నేపథ్యంలో...; ఈ కరోనా వైరస్ ని గుర్థించడానికి అసలు ఏ టెస్టులు అవసరం లేకుండా గుర్తించేందుకు ఒక సాఫ్ట్ వేర్ రూపొందించాడు మన హైద్రాబాదీ!

హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెరువు ఆనంద్...కరోనా వైరస్ ని గుర్తించడానికి సిటీ స్కాన్, ఛాతి ఎక్స్ రే సరిపోతుందని అంటున్నాడు. వీటి ఆధారంగా కృత్రిమ మేధ( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ద్వారా కరోనా వైరస్ ఉందొ లేదో కనుక్కునేలా సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసాడు ఈ టెక్కీ!

ఇలా టెస్టు అవసరం లేకుండానే ఫలితాలు చెప్పడమే కాకుండా చిటికలో ఫలితాలను ఇస్తుంది. ఒకేసారి దాదాపుగా 4000 స్కాన్లు, ఎక్స్ రేలను దీని ద్వారా పరిశీలించి ఫలితాలను చెప్పవచ్చు. 

అంతేకాకుండా ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వచ్చే ఫలితాలు టెస్టులకన్నా ఖచ్చితత్వంతో కూడుకున్నవి అని అంటున్నాడు ఈ యువ ఇంజనీర్. 99.4 శాతం ఖచ్చితత్వంతో కరోనా వైరస్ ని గుర్తించిచ్చట. 

సాఫ్ట్ వేర్ పేటంట్ల కోసం ఇటు భారతదేశంలోనూ, అటు అమెరికాలోను అప్లై చేసానని నిన్న ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోప్ వివరించాడు ఆనంద్. త్వరలోనే ఈ సాఫ్ట్ వేర్ ను మరింత సమర్థవంతంగా వాడుకలోకి తీసుకొచ్చేనందుకు యాప్ తయారీకి కూడా ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. 

 తెలంగాణపై కరోనా వైరస్ మహమ్మారి తన పంజాను విసురుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 42 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్నిరోజులు నమోదవుతున్న కేసులు హైదరాబాద్ లో మాత్రమే నమోదవుతుండగా... నిన్న మరల రంగారెడ్డి జిల్లాలో కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. 

నిన్న నమోదైన 42 కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 37 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వలస కార్మికులు కరోనా పాజిటివ్ గా తేలారు. వీటితో కలుపుకొని ఇప్పటివరకు తెలంగాణాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1551. 

ఇప్పటివరకు 34 మంది మరణించగా 992 మంది వైరస్ బారినపడి నయమై డిశ్చార్జ్ అయ్యారు. నేడొక్కరోజే 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణించిన వారిని, డిశ్చార్జ్ అయినవారిని తీసేస్తే... 525 ఆక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. 

click me!