తెలంగాణాలో ఉధృతమవుతున్న కరోనా వ్యాప్తి: నేడొక్కరోజే 42 కేసులు

By Sree s  |  First Published May 17, 2020, 9:56 PM IST

తెలంగాణపై కరోనా వైరస్ మహమ్మారి తన పంజాను విసురుతూనే ఉంది. నేడు ఒక్కరోజే 42 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్నిరోజులు నమోదవుతున్న కేసులు హైదరాబాద్ లో మాత్రమే నమోదవుతుండగా... నేడు మరలా రంగారెడ్డి జిల్లాలో కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. 


తెలంగాణపై కరోనా వైరస్ మహమ్మారి తన పంజాను విసురుతూనే ఉంది. నేడు ఒక్కరోజే 42 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్నిరోజులు నమోదవుతున్న కేసులు హైదరాబాద్ లో మాత్రమే నమోదవుతుండగా... నేడు మరలా రంగారెడ్డి జిల్లాలో కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. 

ఈ రోజు నమోదైన 42 కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 37 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వలస కార్మికులు కరోనా పాజిటివ్ గా తేలారు. వీటితో కలుపుకొని ఇప్పటివరకు తెలంగాణాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1551. 

Latest Videos

undefined

ఇప్పటివరకు 34 మంది మరణించగా 992 మంది వైరస్ బారినపడి నయమై డిశ్చార్జ్ అయ్యారు. నేడొక్కరోజే 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణించిన వారిని, డిశ్చార్జ్ అయినవారిని తీసేస్తే... 525 ఆక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. 

ఇకపోతే.... దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. ఆదివారంతో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ క్రమంలో లాక్‌డౌన్ 4కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ప్రజా రవాణా విషయంలో గతంలో ఉన్నట్లే ఆంక్షలను విధించింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని ఆదేశాల్లో పేర్కొంది.

అదే సమయంలో కంటైన్మెంట్ జోన్లు మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకునేదుందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకు రాష్ట్రాల పరస్పర అంగీకారం ఉండాలని స్పష్టం చేసింది. 

click me!