హైద్రాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో రూ.2 కోట్ల నగదును పోలీసులు ఇవాళ సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం ఈ నగదును తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో కారులో రూ. 2 కోట్ల నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు. కారులో నగదును తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.దీంతో కారును పోలీసులు తనిఖీ చేశారు.మంగళవారం నాడు రాత్రి పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ నగదును సీజ్ చేశారు.
ఈ కారులో రూ. 2 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు లెక్కలు లేవని పోలీసులు గుర్తించారు. ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్నకూడా హైద్రాబాద్ గాంధీ నగర్ లో భారీగా నగదును సీజ్ చేశారు. రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు వాహనాలను తనిఖీలు చేసే సమయంలో కారులో ఈనగదును తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు.
alsoread:హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత.. రూ. 3.5 కోట్లు సీజ్..
ఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రూ. 2.5 కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన పాతబస్తీలో రూ.79 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఈ నెల 7న జూబ్లీహిల్స్ లో రూ. 50లక్షలను హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైద్రాబాద్ నగరంలోని హోటల్ నుండి డబ్బును సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పాతబస్తీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా ఈ డబ్బులను మునుగోడుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నగరంలో పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వచ్చే నెల 3వ తేదీన మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
గతంలో కూడ హైద్రాబాద్ లో హవాలా రూపంలో నగదును తరలిస్తుండగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 సెప్టెంబర్ 15న రూ. 3.75 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2020 అక్టోబర్ 31న హైద్రాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు ఇద్దరిని అరెస్ట్ చేశారు. రవాణా వ్యాపారం పేరుతో హవాలా రూపంలో డబ్బును తరలిస్తున్నారనే సమచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.