మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసు: 600 పేజీలతో చార్జీషీట్ దాఖలు

By narsimha lode  |  First Published Oct 12, 2022, 9:44 AM IST

సర్వీస్ నుండి తొలగించబడిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో రాచకొండ పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న రాచకొండ పోలీసులు  బుధవారం నాడు కోర్టులో చార్జీసీట్ దాఖలు చేశారు. 


హైదరాబాద్: సర్వీసు నుండి డిస్మిస్ అయిన  మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో రాచకొండ పోలీసులు కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు.వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో నాగేశ్వరరావును రెండు రోజుల క్రితమే సర్వీస్ నుండి తొలగిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

ఈ ఏడాది జూలై 7వ తేదీన హైద్రాబాద్ హస్తినాపురంలో వివాహితను రివాల్వర్ తో బెదిరించి మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు. అయితే వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కొద్దిసేపటికే వివాహిత భర్త ఇంటికి వచ్చాడు.  వివాహిత తో  పాటు ఆమె భర్తను నాగేశ్వరరావు బెదిరించారు. వీరిద్దరిని   నాగేశ్వరరావు తన ఫామ్ హౌస్ కు కారులో తీసుకువెళ్తున్న సమయంలో  ఇబ్రహీంపట్నం  సమీపంలో  రోడ్డు ప్రమాదం జరిగింది.దీంతో భార్యాభర్తలు అక్కడి నుండి తప్పించుకొని  వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును పోలీసులు  అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టై రెండు మాసాల పాటు జైల్లోనే   నాగేశ్వరరావు ఉన్నాడు.

Latest Videos

అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 26న షరతులతో నాగేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. గతంలో రెండు దఫాలు హైకోర్టు ఆయనకు బెయిల్ ను తిరస్కరించింది.  హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నాగేశ్వరరావు  జైలు నుండి బయటకు వచ్చాడు. 

వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావుపై హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ సస్సెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.  బెయిల్ పై  జైలు నుండి బయటకు  వచ్చిన నాగేశ్వరరావుకు మరో  షాక్ తగిలింది.తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నాగేశ్వరరావును సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ  హైద్రాబాద్ సీపీ  రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు.

also read:మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై వేటు.. పోలీసు శాఖ సర్వీసు నుంచి తొలగింపు..

వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో 600  పేజీలతో కోర్టులో రాచకొండ పోలీసులు  చార్జీషీట్ దాఖలుచేశారు. ఈ  చార్జీషీట్ లో డీఎన్ఏ రిపోర్టు, మాజీ సీఐ నాగేశ్వరరావు పొటెన్సీ టెస్ట్ నివేదిక,  ఫోరెన్సిక్  రిపోర్టు సహా ఇతర టెక్నికల్ ఆధారాలను కూడా పోలీసులు పొందుపర్చారు. వివాహిత ఇంటికి మాజీ సీఐ వచ్చిన సమయంలో పోలీసులు సీజ్ చేసిన సీసీటీవీ దృశ్యాలు, ఇబ్రహీంపట్నం వద్ద  రోడ్డు ప్రమాదం వివరాలకు సంబంధించి సమాచారాన్ని కూడా పోలీసులు చార్జీషీట్ లో పొందుపర్చారు. 

 బాధితురాలి వాంగ్మూలంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004 బ్యాచ్ కు చెందిన నాగేశ్వరరావు  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైబరాబాద్ కు బదిలీ అయ్యారు. టాస్క్ ఫోర్స్ లో నాగేశ్వరరావు చాలా కాలంపాటు పనిచేశాడు. 

click me!