అమెరికాలోని చికాగోలో జరిగిన కాల్పుల్లో విజయవాడకు చెందిన దేవాన్ష్ అనే విద్యార్ధి మృతి చెందారు హైద్రాబాద్ కు చెందిన సాయిచరణ్ ఈ ఘటనలో గాయపడ్డాడు.
హైదరాబాద్: అమెరికాలోని చికాగోలో దుండగుడు జరిపిన కాల్పుల్లో విజయవాడకు చెందిన దేవాన్ష్ అనే విద్యార్ధి మృతి చెందాడు. ఇదే ఘటనలో హైద్రాబాద్ కు చెందిన సాయిచరణ్ అనే విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. సాయిచరణ,్ దేవాన్ష్ లు వాల్ మార్ట్ కు వెళ్లున్న సమయంలో దుండుగుడు కాల్పులకు దిగాడు. ఈ కాల్లపుల్లో దేవాన్ష్ మృతి చెందినట్టుగా సమాచారం అందింది.
వాల్ మార్ట్ వద్ద ఈ ఇద్దరు యువకుల వద్ద ఉన్న వస్తువులను దుండగులు లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఇద్దరు విద్యార్ధులు దుండగులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో దేవాన్ష్ మృతి చెందారు. ఈ కాల్పుల్లో సాయి చరణ్ గాయపడినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.