
హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటి అధికారులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని యూపీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్టుగా కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న ముగ్గురు యూపీ వాసుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మరోవైపు హైద్రాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారం పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. Ashish Jain ఇంట్లో NCB అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో రూ. 3.71 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. అమెరికాతో పాటు పలు విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించారు. Pharrmacy ముసుగులో ఆశీష్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది., బిట్ కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ద్వారా లావా దేవీలు జరిగాయని కూడా అధికారులు గుర్తించారు.
ఇంటర్ నెట్ పార్మసీ, జీఆర్ ఇన్‌పీనిటీ పేరుతో ఆశీష్ జైన్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది. గత రెండేళ్లలో వెయ్యికి పైగా విదేశఆలకు ఆర్డర్లు పంపిన విషయాన్ని కూడా ఎన్సీబీ గుర్తించింది.న్యూఢిల్లీకి చెందిన ఎన్సీబీ అధికారుల బృందం హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఆశీష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో డ్రగ్స్ కూడా సీజ్ చేశారు.