హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్స్ కలకలం.. పారడైస్ వద్ద బైక్ వదిలివెళ్లిన దుండగులు.. రంగంలోకి ప్రత్యేక బృందాలు..

Published : Jan 07, 2023, 01:14 PM ISTUpdated : Jan 07, 2023, 01:32 PM IST
హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్స్ కలకలం.. పారడైస్ వద్ద బైక్ వదిలివెళ్లిన దుండగులు.. రంగంలోకి ప్రత్యేక బృందాలు..

సారాంశం

హైదరాబాద్‌లో  చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జంట నగరాల్లో రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌లో  చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జంట నగరాల్లో రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఓయూ, ఉప్పల్, నాచారం, రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్‌లో రెండు, నాచారం, చికలగూడ, రాంగోపాల్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కొక్కటి చొప్పున చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. చైన్‌స్నాచర్లు తొలుత ఉప్పల్‌లో ఉదయం 6.20 గంటలకు చోరీ ప్రారంభించి.. చివరగా ఉదయం 8.10 రామ్‌గోపాల్ పేటలో ముగించారు. ఇందుకోసం దుండగులు ఒక్క పల్సర్ బైక్‌ను వినియోగించారు. బైక్‌ మీద తిగిరుతూ.. ఉప్పల్, కళ్యాణపురి, నాచారం, ఓయూలోని రవీంద్రనగరల్, చిలకలగూడ, రామ్‌గోపాల్ పేట ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడారు. 

అయితే చోరీలకు దుండగులు వినియోగించు బైక్‌ను దొంగిలించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీలు చేసే సమయంలో దుండగులు ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్నారు. చోరీల అనంతరం దుండగులు పారడైస్ వద్ద వదిలివెళ్లారు. నిందితులు చోరీలకు వినియోగించిన బైక్‌ను పారడైస్ వద్ద గుర్తించిన రాంగోపాల్ పేట్ పోలీసులు.. దానిని స్వాధీనం చేసుకున్నారు.  

ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ నేరాలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా సభ్యులు నగరం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్న పోలీసులు..  అన్ని రైల్వే స్టేషన్లు, శంషాబాద్ విమానాశ్రయం వద్ద నిఘా ఉంచారు. నగరంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తు్నారు. ముఠా సభ్యులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !