గోదావరిఖనిలో బట్టల షాపులో ఘోర అగ్నిప్రమాదం..

By AN TeluguFirst Published Nov 27, 2021, 9:05 AM IST
Highlights

గోదావరిఖని నగరంలోని లక్ష్మీ నగర్ లో  శనివారం తెల్లవారు జామున ఓ బట్టల షాపులో  ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర దుకాణాలకు అంటుకోలేదు. దీంతో ప్రమాదం జరిగిన షాప్ పూర్తిగా దగ్ధం అయినా.. మిగతా షాపులకు మంటలు వ్యాపించలేదు.

పెద్దపల్లి జిల్లా : Godavarikhani  నగరంలోని లక్ష్మీ నగర్ లో  శనివారం తెల్లవారు జామున ఓ Clothing shop లో  ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాసేపటికి దీన్ని గమనించిన చుట్టు పక్కలవారు యజమానికి సమాచారం అందించారు. అతను వెంటను అక్కడికి చేరుకుని, పోలీసులకు,Firefightersకి సమాచారం అందించాడు.

వారు వచ్చేవరకు వేచి చూడకుండా స్థానికుల సహాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మంటలు విపరీతంగా వ్యాపించి.. షాపులో నుంచి బయటకి ఎగిసిపడుతున్నాయి. దీంతో బట్టల షాపు పూర్తిగా దగ్ధమయ్యింది.

అయితే, వరుసగా ఉన్న ఇతర దుకాణాలకు మంటలు విస్తరించకుండా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్ బాబు,ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇదిలా ఉండగా, శుక్రవారం నాడు జ‌మ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో  శుక్ర‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో రెండు ఏసీ కోచ్‌ల‌లో మంట‌లు అంటుకున్నాయి. క్ష‌ణాల్లోనే మ‌రో రెండు ఏసీ కోచ్‌ల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌డంతో.. ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

రాజ‌స్థాన్‌లోని Dhaulpur, Madhya Pradeshలోని  మోరినామ‌ధ్య ఈ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుందని రైల్వే వర్గాలు తెలిపాయి. హేతంపూర్‌ నుంచి ఝాన్సీ‌కి  రైలు వెళ్తుండ‌గా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. 

అయితే ఓ కోచ్‌లోని ఏసీలో మంట‌లు చెల‌రేగ‌డంతోనే ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే సకాలంలో గుర్తించి ప్రయాణీకులను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 8, సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు నవజాత శిశువులు మరణించారు. కమలా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని newborn-care unitలో మంటలు వ్యాపించాయి. 

విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. పేలుతున్న గ్యాస్ సిలిండర్లు, 20 పూరిళ్లు దగ్ధం

"స్పెషల్ నవజాత శిశు సంరక్షణ యూనిట్ (SNCU) వార్డులో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు చనిపోయి ఉండవచ్చు, బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే మేం ఇతరులతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాం. వార్డు లోపల అంతా చీకటిగా ఉంది. మిగిలిన పిల్లలను పక్కనే ఉన్న వార్డుకు తరలించాం’’ అని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు.

ఆసుపత్రిలోని మూడవ అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. ఈ అంతస్తులోనే ఐసియు వార్డు ఉంది. ఈ ఐసియు వార్డులో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయని, వెంటనే సమాచారం తెలియడంతో.. 8-10 మంది అగ్నిమాపక ఇంజనీర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఫతేఘర్ ఫైర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జుబేర్ ఖాన్ తెలిపారు.

"ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. అదనపు చీఫ్ సెక్రటరీ (ఏసీఎస్) హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్, మహ్మద్ సులేమాన్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది" అని Chief Minister శివరాజ్ సింగ్ చౌహాన్  ట్వీట్‌లో తెలిపారు.

click me!