హైదరాబాద్ వర్షాలు : మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర మహిళ మృతదేహం.. లక్ష్మిదేనా??

By SumaBala Bukka  |  First Published Sep 6, 2023, 8:47 AM IST

హైదరాబాద్ లోని మూసారాం బ్రిడ్జి దగ్గర.. మూసీలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. 


హైదరాబాద్ : హైదరాబాదులోని మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఓ మహిళ మృతదేహం దొరికింది. మహిళ మృతదేహం మూసిలో కొట్టుకొచ్చింది. నాలుగు రోజుల క్రితం  హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన లక్ష్మీదిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని గుర్తించిన జిహెచ్ఎంసి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

మహిళ కుటుంబసభ్యులు ఇప్పటికే గాంధీనగర్ నుంచి మూసారాం బ్రిడ్జి దగ్గరికి చేరుకున్నారు. ముక్కుపుడకను బట్టి తల్లిదేనని కూతురు చెబుతోంది. ఆమె చేతిమీద కమలా అనే పచ్చబొట్టు ఉంటుందని.. అలా ఉంటే అది తల్లిదేనని చెబుతున్నారు. అయితే క్లూస్ టీం ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. వారు వచ్చిన తరువాత వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియాకు పంపించనున్నారు. 

Latest Videos

కాగా, ఆదివారం నాడు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దామోదరం సంజీవయ్య నగర్ లో ఉండే లక్ష్మి అనే 55 యేళ్ల మహిళ అదృశ్యం అయ్యింది. నాలాలో పడి గల్లంతయ్యిందని కుటుంబ సభ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆమె గురించి తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. కానీ మృతదేహం లభ్యం కాలేదు. ప్రస్తుతం మూసారాం బాగ్ దగ్గర కొట్టుకొచ్చిన మృతదేహం ఆమెదే అని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


హైదరాబాద్ లో భారీ వర్షాలు : హుస్సేన్ సాగర్ నాలాలో పడి మహిళ గల్లంతు...

click me!